US Election 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలుస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయులు తనవైపే నిలుస్తారని ట్రంప్ ధీమా వ్యక్తంచేశారు. కమలా హారిస్ కంటే తనకే ఎక్కువగా భారతీయుల మద్ధతు ఉందని ఆయన పేర్కొన్నారు. తాను ఈ మాటలు ఊరికే చెప్పడం లేదని... కమలా హారిస్ కంటే తనకే ఎక్కువ మంది భారతీయుల మద్ధతు ఉన్నట్లు రూడీ చేసుకున్న తర్వాతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ కంటే కమలా హారిస్ అభ్యర్థిత్వం దారుణమంటూ ట్రంప్ మండిపడ్డారు. న్యూ జెర్సీలో పోలీస్ బెనెలవొలెంట్ అసోసియేషన్ సభ్యలతో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. జో బిడెన్ దేశాధ్యక్షుడైతే..మరుక్షణమే అమెరికా పోలీసులకు వ్యతిరేకంగా చట్ట మార్పులు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేస్తారని ఆరోపించారు. ఈ విషయంలో కమలా హారిస్ మరింత దారుణమని వ్యాఖ్యానించారు.
కమలా హారిస్‌ను తనకు పోటీగానే పరిగణించడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. కమలా హారిస్‌ను నల్లజాతి ప్రతినిధిగా పరిగణిస్తున్నారా? అన్న ప్రశ్నకు...ఏమైనా తనకు సమస్య కాదన్నారు. అమెరికాను పాలించేందుకు కమలా హారిస్ సరైన ఎంపిక కాదని ఇది వరకే ట్రంప్ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamala Harris, US Elections 2020