Home /News /international /

US ELECTION RESULTS 2020 BIDEN LEADING IN GEORGIA AND PENNSYLVANIA SU

US Elections 2020: విజయానికి చేరువలో బైడెన్.. ఆ రాష్ట్రంలో రీకౌంటింగ్ తప్పదన్న అధికారులు

జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)

జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక తుది ఫలితాలు వెలువడడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఫలితాలపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్టు అంతా భావిస్తున్నారు.

    ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక తుది ఫలితాలు వెలువడడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఫలితాలపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్టు అంతా భావిస్తున్నారు. తొలుత రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్(Joe Biden)‌ల మధ్య హోరా హోరిగా పోరు సాగినప్పటికీ.. తాజా పరిణామాలు బైడెన్ వైపే మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష స్థానం దక్కించుకోవడాని ఆరు ఎలక్ట్రోరల్ ఓట్ల దూరంలో నిలిచిన బైడెన్.. భారీ విజయం నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. నిన్నటివరకు కేవలం 6 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్న నెవెడాలో మాత్రమే బైడెన్ ముందజలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ భారీ అధిక్యంలో ఉన్నారు. ఈ ఆరు స్థానాలు బైడెన్ ఖాతాలోకి వెళతాయని అంతా భావిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఖాతాలో వేసుకుంటే ట్రంప్ అధ్యక్ష పీఠానికి అవసరమైన 270  ఎలక్ట్రోరల్ స్థానాలు సాధించినట్టే.

    ఇదిలా ఉంటే.. తాజాగా ఇప్పటివరకు ట్రంప్ హవా కొనసాగిన జార్జియా, పెన్సిల్వేనియాలో కూడా బైడెన్ అధిక్యంలోని దూసుకెళ్లారు. దీంతో బైడెన్ భారీ మెజారిటీ సొంతం చేసుకుంటారని డెమొక్రాట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బైడెన్ 264, ట్రంప్ 213 ఎలక్ట్రోరల్ స్థానాలు సాధించారు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడాల్సి ఉండగా ట్రంప్ అలస్కా(3 ఎలక్ట్రోరల్ స్థానాలు), నార్త్ కరోలినాలలో(15 ఎలక్ట్రోరల్ స్థానాలు) మాత్రమే అధిక్యంలో ఉన్నాయి.

    అయితే జార్జియాలో బైడెన్ అధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ.. అక్కడ ట్రంప్, బైడెన్‌ల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉంది. 99 శాతం కౌంటింగ్ పూర్తయిన జార్జియాలో బిడెన్‌కు 49.40 శాతం(2,450,117 ఓట్లు) పోలవగా, ట్రంప్‌కు 49.37 శాతం(2,448,538 ఓట్లు) పోలయ్యాయి. ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం రెండు వేలు మాత్రమే ఉంది. అలాగే మరిన్ని పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించాల్సి ఉందనే వార్తలు వస్తున్నాయి. అభ్యర్థుల మధ్య అంతరం చాలా స్వల్పంగా ఉండటంతో అక్కడ రీకౌంటింగ్ తప్పదని అధికారులు చెబుతున్నారు. రీకౌంటింగ్ నిర్వహించిన పక్షంలో జార్జియా ఫలితం మరింత ఆలస్యం కానుంది.

    ఇక, ఓట్ల పరంగా కూడా ట్రంప్‌ కన్నా బైడెన్‌ అధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన వాటిలో ట్రంప్ కంటే బైడెన్‌కు దాదాపు 4 మిలియన్ల ఓట్లు అధికంగా వచ్చాయి. మరోవైపు బిడైన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడం దాదాపు ఖారారు కావడంతో డెమొక్రాట్లు ఆనందంలో మునిగితేలుతున్నారు. బైడెన్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం భద్రతను పెంచింది. మరోవైపు ట్రంప్‌ను ఉద్దేశించి కొందరు డెమొక్రాట్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

    ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించడానికి సుముఖత చూపడం లేదు. శుక్రవారం పలువురు రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు, సలహాదార్లతో భేటీ అయిన ట్రంప్ పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇందులో కొందరు కోర్టుల్లో గట్టిగా పోరాడాలని, మరికొందరు ఓటమిని హుందాగా అంగీకరించాలని సూచించారు. మరోవైపు తన లీగల్ టీమ్‌పై ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Donald trump, Joe Biden, US Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు