హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అమెరికాలో చిట్టచివరి ఎన్నికల వివాదం క్లోజ్.. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారంటే..

అమెరికాలో చిట్టచివరి ఎన్నికల వివాదం క్లోజ్.. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారంటే..

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

చరిత్రలో కనివినీ ఎరుగుని రీతిలో సంచలనం సృష్టించిన వివాదాస్పదమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిట్టచివరి వివాదం కొలిక్కి చేరింది.

చరిత్రలో కనివినీ ఎరుగుని రీతిలో సంచలనం సృష్టించిన వివాదాస్పదమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిట్టచివరి వివాదం కొలిక్కి చేరింది. ఎట్టకేలకు న్యూయార్క్ 22వ కంగ్రెషనల్ డిస్ట్రిక్ రిపబ్లికన్ అభ్యర్థి క్లాడియా టెన్నీ విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థి అయిన డెమాక్రటిక్ యూఎస్ రెప్రెజెంటేటివ్ ఆంటోనీ బ్రిండిసి ఓటమిని హుందాగా అంగీకరించి, తన అధికారాలను బదిలీ చేసేందుకు అంగీకరించారు. అతిత్వరలో చట్టసభలో క్లాడియా ప్రమాణ స్వీకారం చేసేందుకు అమెరికా పార్లమెంటులో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ప్రకటనతో కంగ్రెషనల్ రేస్ లో మిగిలిన తుది వ్యాజ్యం కూడా ముగిసిందన్నమాట. సెంట్రల్ న్యూయార్క్ 22వ కంగ్రెషనల్ డిస్ట్రిక్ ఎన్నికల్లో క్లాడియా 109 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచినట్టు స్టేట్ జడ్జ్ రూలింగ్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పలు ఫెడెరల్ ఎలక్షన్ రూల్స్ ను అతిక్రమించే చర్యలు చాలా చోటుచేసుకున్నాయని ఓటమిని అంగీకరించిన బ్రిండిసి వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల వివాదం ముగిసిందని, ఇక ఇదంతా ముగిసిన అధ్యాయంగా ఆయన అధికారిక ప్రకటన చేసి బాధ్యతల నుంచి శాంతియుతంగా తప్పుకొంటున్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ అధికార ప్రకటనతో మరోమారు ప్రజా ప్రతినిధిగా క్లాడియాకు బాధ్యతలు తీసుకునే అవకాశం దక్కింది. మూడు నెలలపాటు ఈ ఎన్నికల వివాదం కోర్టులో నలిగింది. దీంతో అమెరికా పార్లమెంటులో రిపబ్లికన్లకు మొత్తం 210 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండగా అధికార డెమాక్రాట్ల సంఖ్యాబలం 221కి చేరింది.

మధ్యంతర ఎన్నికల్లో గెలుపు..

తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని చెప్పుకున్న బ్రిండిసి గత రెండేళ్లుగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతుండగా అంతకు ముందు 2018 వరకు క్లాడియా ఈ పదవిలో కొనసాగారు. 2018 మధ్యంతర ఎన్నికల్లో క్లాడియా ఓటమిపాలు కాగా ఆంటోనీ బ్రిండిసి ఇక్కడ గెలుపొందారు.

నేను చాలా హ్యాపీ..

కాగా ఈ విజయాన్ని తాను సగర్వంగా అంగీకరిస్తున్నట్టు క్లాడియా ప్రకటన చేశారు. ఈమేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసి, అత్యంత క్లిష్టమైన ఎన్నికలకు వీటిని అభివర్ణించారు. స్పీకర్ నాన్సీ పెలోసీ క్లాడియా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


ట్రంప్‌కు ఫేవరేట్

రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు అత్యంత ఇష్టమైన న్యూయార్క్ నగరంలో ట్రంప్ కు ఒకప్పుడు భారీగా మద్దతు ఉండేది. కానీ నాలుగేళ్ల క్రితం వరకు ఆయన మద్దతిచ్చిన న్యూయార్క్ వాసులు ట్రంప్ ప్రవర్తన విసిగిపోయి ప్రత్యర్థి పార్టీవైపు మొగ్గుచూపినప్పటికీ చివరికి ట్రంప్ పార్టీనే ఇక్కడ గెలుపొందటం హైలైట్ గా అమెరికన్ మీడియా విశ్లేషిస్తోంది. "అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ మెయిన్ రోడ్ లోని ఫిఫ్త్ అవెన్యూ మీద నేను ఎవరినైనా కాల్చి చంపినా నాకు పడే ఓట్లు ఏమాత్రం తగ్గవంటూ" గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈసందర్భంగా అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

First published:

Tags: New york, US Elections 2020

ఉత్తమ కథలు