US ELECTION HOLLYWOOD CELEBRITIES STRIP DOWN TO ENCOURAGE VOTERS TREND ON SOCIAL MEDIA BA
US Elections 2020: ఓటేయండి అంటూ హాలీవుడ్ స్టార్లు నగ్నంగా ప్రచారం వీడియో
ఓటు వేయాలంటూ జెన్నీఫర్ లోపెజ్ ప్రచారం (Image; Twitter)
కొందరు నటీమణులు ‘నేను ఓటే వేశా. మీరూ వేయండి.’ అంటూ వెరైటీగా ప్రచారం చేశారు. కొందరైతే ఏకంగా నగ్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజల్లో ఓటు హక్కు మీద అవగాహన పెంచేందుకు దోహదపడ్డారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీ జరుగుతోందని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చెబుతున్నాయి. చివరికి తామే గెలుస్తామని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అమెరికాలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్టు చెబుతున్నారు. ఓటు వేయాలనే తపన ఓటర్లలో ఉండడంతో పాటు వారిని పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా ప్రోత్సహించడంలో హాలీవుడ్ నటులు కూడా ప్రముఖ పాత్ర పోషించారనుకోవాలి. ఎందుకంటే కొందరు నటీమణులు ‘నేను ఓటే వేశా. మీరూ వేయండి.’ అంటూ వెరైటీగా ప్రచారం చేశారు. కొందరైతే ఏకంగా నగ్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజల్లో ఓటు హక్కు మీద అవగాహన పెంచేందుకు దోహదపడ్డారు. కేట్ బెకిన్సైల్, చెల్సియా హ్యాండ్లర్, జెన్నీఫర్ లోపెజ్, కెండాల్ జెన్నర్, లిజో సహా ఎందరో హాలీవుడ్ సెలబ్రిటీలు ‘సెక్సీ’గా ప్రచారం చేశారు.
‘నేను ఓటు వేశా’ అనే స్టిక్కర్లను తమ ఎదపై అతికించుకుని ‘మీరు కూడా ఓటు వేయండి.’ అంటూ ప్రజలను కోరింది జెన్నీఫర్ లోపెజ్. అలాగే, అమెరికన్ ఫ్లాగ్‌లను ముద్రించారు.
మరో నటి లిజో అయితే ఏకంగా నగ్నంగా క్యాంపెయిన్ చేసింది. అమెరికన్ ఫ్లాగ్ తన శరీరంపై ఒకవైపు మాత్రమే కప్పుకొని, మరో వైపు నగ్నంగా ఉన్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘దేశం అంటే చట్టాలు కాదు. దేశం అంటే మనుషులు. లైన్లో ఉండండి. ఓటు వేయండి.’ అంటూ పోస్ట్ చేశారు.
వీరు మాత్రమే కాదు. చాలా మంది సెలబ్రిటీలు మార్క్ రుఫాలో, కమెడియన్లు అమీ స్కమర్, సారా సిల్వర్ మెన్, క్రిస్ రాక్, సూపర్ మోడల్ నవోమీ క్యాంప్‌బెల్ లాంటి వారి వీడియోలు సోషల్ మీడియాలో విస్త్రంతంగా ప్రచారం అయ్యాయి. వారంతా ఓటు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఆ వీడియోల్లో నటులు కూడా ఇలాగే అర్థనగ్నంగా కనిపించారు.
ఈ రేంజ్లో ప్రచార చేయడం బాగా పనిచేసినట్టుంది. ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్ నమోదైంది. అయితే, అది ఎవరి వైపు మళ్లుతుందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.