Home /News /international /

US Election Result 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో డొనాల్డ్ ట్రంప్

US Election Result 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

US Election 2020 Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. వరుసగా రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ట్రంప్(రిపబ్లిక్ పార్టీ) ఉవ్విళ్లూరుతుండగా...45వ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేతసౌధంలో అడుగుపెట్టాలని బిడెన్(డెమోక్రటిక్ పార్టీ) ఆకాంక్షిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    US Election Results 2020 Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. వరుసగా రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ట్రంప్(రిపబ్లిక్ పార్టీ) ఉవ్విళ్లూరుతుండగా...45వ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేతసౌధంలో అడుగుపెట్టాలని బిడెన్(డెమోక్రటిక్ పార్టీ) ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో 12 రాష్ట్రాల్లో జో బిడెన్ జయకేతనం ఎగురవేయనుండగా...13 రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కీలకమైన ఫ్లోరిడా రాష్ట్రంలో ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఫ్లోరిడాలోనూ ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ప్రారంభ ట్రెండ్స్‌తో బిడెన్ ఆధిక్యతను కనబరచగా...ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పుంజుకున్నారు. అమెరికా మీడియాలో వస్తున్న కథనాల మేరకు బిడెన్‌పై ట్రంప్  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ట్రంప్ 231 ఎలక్టోరల్ ఓట్స్‌తో ఆధిక్యంలో నిలుస్తుండగా...జో బిడెన్ 173 ఎలక్టోరల్ ఓట్స్‌లో ముందున్నాడు. 270 ఎలక్టోరల్ ఓట్స్ గెలిచిన వారు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారు.

    ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో డొనాల్ట్ ట్రంప్ 13 రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇండియానా, కెంటుకీ, అలబామా, మిస్సిస్సిపీ, టెన్నెస్సీ, ఓక్లహోమ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. 2016లో గెలిచిన పలు రాష్ట్రాల్లో ఈ సారి కూడా ట్రంప్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

    us election results 2020, us election result news, trump vs biden, us presidential election result, us presidential election news, us presidential poll latest news, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020
    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ


    జొ బిడెన్ 12 రాష్ట్రాలలో ఆధిక్యంలో నిలుస్తున్నారు. తన సొంత రాష్ట్రం డెలవేర్‌తో పాటు రోడ్ ఐలాండ్, న్యూజెర్సీ, మస్సాచుసెట్స్, మేరీలాండ్, ఇల్లినోయిస్, డెలవేర్, కన్నెక్టికట్ రాష్ట్రాల్లో బిడెన్ విజయం సాధంచారు. అలాగే న్యూయార్క్‌‌ రాష్ట్రాన్ని జో బిడెన్ సొంతం చేసుకున్నారు. అక్కడ బిడెన్‌కు 29 ఎలెక్టోరల్ ఓట్లు దక్కాయి.
    Published by:Janardhan V
    First published:

    Tags: Donald trump, US Elections 2020

    తదుపరి వార్తలు