US ELECTION 2020 RESULTS BIDEN WINS NEW YORK TRUMP VICTORIOUS IN LOUISIANA
US Election 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ.. ట్రంప్-5, బిడెన్ -8
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
US Election 2020 Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ట్రంప్, బిడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో ట్రంప్‌పై బిడెన్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అయితే ఫ్లోరిడా వండి కీలక రాష్ట్రాల ఫలితాలు అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది నిర్ణయించనున్నాయి.
US Presidential Election Result 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. వరుసగా రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ట్రంప్(రిపబ్లిక్ పార్టీ) ఉవ్విళ్లూరుతుండగా...45వ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేతసౌధంలో అడుగుపెట్టాలని బిడెన్(డెమోక్రటిక్ పార్టీ) ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఎనిమిది రాష్ట్రాల్లో జో బిడెన్ జయకేతనం ఎగురవేయగా...ఐదు రాష్ట్రాలను ట్రంప్ హస్తగతం చేసుకున్నారు.
-జొ బిడెన్ 8 రాష్ట్రాలలో విజయం సాధించారు. తన సొంత రాష్ట్రం డెలవేర్తో పాటు రోడ్ ఐలాండ్, న్యూజెర్సీ, మస్సాచుసెట్స్, మేరీలాండ్, ఇల్లినోయిస్, డెలవేర్, కన్నెక్టికట్ రాష్ట్రాల్లో బిడెన్ విజయం సాధంచారు. అలాగే న్యూయార్క్ రాష్ట్రాన్ని జో బిడెన్ సొంతం చేసుకున్నారు. అక్కడ బిడెన్‌కు 29 ఎలెక్టోరల్ ఓట్లు దక్కాయి.
-ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో డొనాల్ట్ ట్రంప్ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అలబామా, మిస్సిస్సిపీ, టెన్నెస్సీ, ఓక్లహోమ, లూసియానా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. లూసియానాలో ట్రంప్‌కు 8 ఎలక్టోరల్ ఓట్స్ దక్కాయి.
-కీలక రాష్ట్రమైన ఫ్లోరిడాతో పాటు జార్జియా, ఓహియో తదితర రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా ఉంది.
-అమెరికా మీడియాలో వస్తున్న కథనాల మేరకు బిడెన్ 117 ఎలెక్టోరల్ ఓట్స్, ట్రంప్ 80 ఎలక్టోరల్ ఓట్స్‌లో ఆధిక్యంలో నిలుస్తున్నారు.
కోవిడ్ నిబంధనలతో పోలింగ్..
కరోనా పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మేరకు పోలింగ్ నిర్వహించారు. దాదాపు 100 మిల్లియన్ బ్యాలెట్లలో అమెరికన్ల తీర్పు నిక్షిప్తమయ్యింది. 270 ఎలక్టోరల్ ఓట్స్ గెలిచిన వారు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారు.
-నార్త్ కరోలినాలో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యంగా ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్రంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కాలంగా పోలింగ్ గడువు పొడగించారు.
మాదే విజయం...ట్రంప్ ధీమా...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విజయంపై ధీమా వ్యక్తంచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించే కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, అరిజోనా తదితర రాష్ట్రాల్లో తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.