హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Election 2020: చీకటి రోజులకు చరమగీతం...జో బైడెన్ హామీ

US Election 2020: చీకటి రోజులకు చరమగీతం...జో బైడెన్ హామీ

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

US Election 2020: కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌ చివరి రోజున తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ మాట్లాడిన బైడెన్...దేశంలో నెలకొన్న చీకటి రోజులకు చరమగీతం పాడుతానని హామీ ఇచ్చారు. ఇందు కోసం యావత్ దేశ ఓటర్లు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి ...

  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం మరింత జోరందుకుంది. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించగా...పార్టీ అభ్యర్థిత్వాన్ని బైడెన్ అంగీకరించారు. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌ చివరి రోజున తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ మాట్లాడిన బైడెన్...దేశంలో నెలకొన్న చీకటి రోజులకు చరమగీతం పాడుతానని హామీ ఇచ్చారు. ఇందు కోసం యావత్ దేశ ఓటర్లు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో చీకటి రోజులు కాస్త ఎక్కువకాలమే నెలకొందని వ్యాఖ్యానించారు. తనను దేశాధ్యక్షుడిగా గెలిపిస్తే మీ నమ్మకాలను తాను వమ్ము చేయబోనని హామీ ఇచ్చారు. తాను వెలుగుతో జోడి కడుతాను తప్ప...చీకటితో కాదని వ్యాఖ్యానించారు.

  చీకటి కాలం నుంచి అమెరికాను బయటపడేసే విషయంలో తాను ఎలాంటి తప్పులు చేయబోనని జో బైడెన్ అన్నారు. అటు డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్‌ను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించగా...తన అభ్యర్థిత్వాన్ని ఆమె అంగీకరించారు.

  నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (రిపబ్లికన్ పార్టీ)తో బైడెన్ తలపడనున్నారు. వచ్చే వారం వర్చువల్‌గా జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో తామ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను రీ-నామినేట్ చేస్తున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. బరాక్ ఒబామా హయాంలో బైడెన్...ఆ దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Joe Biden, Kamala Harris, US Elections 2020

  ఉత్తమ కథలు