హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Elections: బిడెన్ గెలవాలని చైనా కోరుకుంటోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

US Elections: బిడెన్ గెలవాలని చైనా కోరుకుంటోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

US Elections: ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చైనా, పెద్ద టెక్ కంపెనీలు, ప్రధాన మీడియా డెమొక్రటిక్ అభ్యర్థి గెలుపుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

  ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చైనా, పెద్ద టెక్ కంపెనీలు, ప్రధాన మీడియా డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలవాలని కోరుకుంటున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఈ కారణంతోనే వారు తనను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారంటూ వాఖ్యా నించారు. బిగ్ టెక్ కంపెనీలు, బిగ్ మీడియా తదితర కొన్ని శక్తులు నిద్రావస్థలో ఉన్న జో గెలవడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. నార్త్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. బిడెన్ అవినీతికి ఎల్లప్పుడూ అండగా ఉంటాడని ఆరోపణలు గుప్పించాడు. అతను అవినీతి రాజకీయ నాయకుడని వాఖ్యానించారు. బిడెన్ మరియు అతని కుటుంబం చైనా నుంచి డబ్బు తీసుకున్నారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ తన మద్దతుదారులు బయటకు వెళ్లి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బిడెన్ పన్నులను పెంచుతాడన్నారు. నిబంధనలను అధికంగా చేస్తాడన్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే కర్మాగారాలను మూసివేస్తాడని ఆరోపించారు. అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలకు ఇస్తాడన్నారు. అదే అతను తన జీవితమంతా చేస్తున్నాడని ట్రంప్ విమర్శలు గుప్పించారు.

  ఇదిలా ఉంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. కానీ అలాంటి వారి అడ్రస్ పట్టుకుని అవసరమైనప్పుడు ప్రజల్లోకి పంపడాన్ని పెద్ద వ్యూహంగా మార్చుకుంటున్నారు ప్రపంచ నేతలు. ఆశ్చర్యంగా ఉన్నా రాజకీయాల్లో ఇది కూడా ఓ ట్రెండే (political trend). ఇప్పటికే సద్దాం హుసేన్, వ్లాదిమిర్ పుతిన్ (Putin body double), ట్రంప్ (Trump body double)వంటివారు ఇలాంటి ట్రిక్కులు ప్లే చేసినట్లు మనం చాలానే చూశాం. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం కనుక కమలా హారిస్ (Kamala Harris body double)కూడా దీన్నే ఫాలో అవుతున్నారని నెటిజన్స్ భావిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న కమలా హారిస్ ఓవైపు ప్రచారపర్వంలో దూసుకుపోతూనే మరోవైపు అచ్చు తనలాగే ఉన్న మరో మహిళను (Fake Kamala Harris) ప్రచార పర్వంలోకి దించినట్లు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ట్రంప్ సొంత జిల్లాలోనే..

  అధ్యక్షుడు ట్రంప్ సొంత జిల్లా అయిన ఫ్లోరిడాలో ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓటర్లతో సందడి చేస్తున్న కమలా హారిస్ ఫుటేజీలు చూసిన వారంతా ఈమె నిజమైన కమలా కాదని తేల్చేస్తున్నారు. అంతేకాదు కమలాకు ఈమెకు మధ్య పోలికలు చాలానే ఉన్నప్పటికీ చాలా తేడాలు కూడా ఉన్నాయని పట్టి చూపిస్తున్నారు. ఇక దీనిపై డెమాక్రాట్లు, రిపబ్లికన్స్ మధ్య వాడివేడి ట్వీట్ల పరంపర సాగుతోంది. మొత్తానికి వైరల్ గా మారిన ఈ వీడియో ఇప్పుడు అమెరికాలో రచ్చ రచ్చ చేసేస్తోంది. మియామీ సిటీలో కమలా హ్యారిస్ (Kamala in Miami) అంటూ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం (#KamalaBodyDouble )సాగుతోంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Donald trump, US Elections 2020

  ఉత్తమ కథలు