అఫ్గానిస్తాన్‌ను తాలిబన్ల చేతిలో వెళ్లిన నాటి నుంచి అక్కడి పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. చాలా మంది ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అనేక మంది స్థానికులు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయం వద్దకు వేలాది మంది చేరుకుంటున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కాబూల్ విమానాశ్రయం(Kabul Airport) వెలుపల గురువారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడులు, పేలుళ్లలో దాదాపు 180 మంది వరకు మరణించినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా అఫ్గాన్ పౌరులే ఉన్నారు. 169 మంది అఫ్గాన్ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించారు. అయితే భీకర దాడులు చేసింది తామేనని ఐసీస్-కే (ISIS-K) ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ దాడికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడులకు ప్రణాళిక రచించిన ఐసిస్-కే కీలక సభ్యుడిని లక్ష్యంగా చేసుకుని అమెరికా డ్రోన్ దాడులకు(US Drone Strike) దిగింది. ఐసీస్-కే ఉగ్రసంస్థకు ప్రధాన కేంద్రంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్(Nangahar province)లో అమెరికా ఈ డ్రోన్ దాడి జరిపింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్(Capt Bill Urban) తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం తాము టార్గెట్‌ను అంతం చేశామని చెప్పారు. ఈ వైమానిక దాడి వల్ల సాధారణ పౌరులకు ప్రాణ నష్టం కలగలేదని అన్నారు.
చేతికి గ్లౌజులు ధరించడం తప్పనిసరి.. హైకోర్టు ఆదేశం.. ఎక్కడంటే.. పూర్తి వివరాలు ఇవే..
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్(Kabul)లో జరిగిన పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. ఆగస్టు 31 వరకు అఫ్గానిస్తాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని బైడెన్ తెలిపారు.
Hyderabad: డీ మార్ట్, ప్యారడైజ్‌లకు షాక్.. భారీ జరిమానా!.. ఎందుకోసమంటే..
ఇక, ఐసిస్-కే పూర్తి పేరు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP). ఐసిస్ (ISIS)కు ఇది ప్రాంతీయ అనుబంధ సంస్థ. ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లో యాక్టివ్‌గా ఉంది. ఆప్ఘనిస్థాన్‌లో ఉన్న అన్ని ఉగ్రవాద గ్రూపుల కంటే ఐసిస్-కే చాలా ప్రమాదకరమైన, హింసాత్మకమైన గ్రూపు. ఇరాక్, సిరియాలో ఐఎస్ తిరుగులేని శక్తిగా ఉన్న 2015లో ఐసిస్-కే ప్రారభమైంది.
ఇక, అప్గాన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అయితే కాబులో మరో బాండు దాడి జరగవచ్చన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం అమెరికా బలగాల చేతిలో ఉన్న కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను వీలైనంత త్వరగా తమ అదుపులోకి తీసుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు. అమెరికా బలగాలు అఫ్గాన్‌ను వీడేలోపే ఈ ప్రయత్నాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా చెప్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Taliban, Us