US DEAD WOUNDED AMBUSH SHOOTING HOUSE PARTY LA GH VB
Ambush Shooting: అమెరికాలోని ఆ నగరంలో కాల్పులు.. దాడిలో నలుగురు మృతి, మరొకరికి గాయాలు..
ప్రతీకాత్మక చిత్రం
అమెరికన్ గన్ కల్చర్‌కు సాక్ష్యంగా నిలుస్తోంది మరో కాల్పుల ఘటన. వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది.
అమెరికన్(American) గన్ కల్చర్‌కు సాక్ష్యంగా నిలుస్తోంది మరో కాల్పుల ఘటన. వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా కాలిఫోర్నియా(California) రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున లాస్ ఏంజెల్స్ సమీపంలోని ఇంగ్లీవుడ్ నగరంలోని ఒక ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. ఒక హౌస్ పార్టీలో (House party) కాల్పులు జరిగిన విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు(Police) వెల్లడించారు. షూటర్లు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు మరణించారని, మరో వ్యక్తి గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇంగ్లీవుడ్ నగరంలోని ఒక ఇంటిపై కాల్పులు జరిగాయనే సమాచారంతో.. పోలీసులు తెల్లవారుజామున 1:30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారని మేయర్ (Mayor) జేమ్స్ బట్స్ ప్రెస్ మీట్లో చెప్పారు.
ఒకరికంటే ఎక్కువ మంది పార్టీ జరుగుతున్న ఇంటిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బుల్లెట్ల గాయాలకు ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మరో వ్యక్తిని పోలీసులు హాస్పిటల్‌కు తరలించగా, ప్రాణాలతో బయటపడ్డాడు. రైఫిల్, హ్యాండ్‌గన్‌తో పాటు మరికొన్ని వెపన్స్‌తో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు మేయర్ జేమ్స్ బట్స్. 1990ల తర్వాత ఇంగ్లీవుడ్లో జరిగిన ఒకే ఒక్క కాల్పుల నేరంగా ఈ ఘటనను మేయర్ అభివర్ణించారు. బాధితులను కొందరు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ యంత్రాంగం నేరగాళ్లను అదుపులోకి తీసుకుంటుందని మేయర్ చెప్పారు. అనుమానితుల కోసం అధికారులు, పోలీసులు అన్వేషిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కొందరు సాక్షులను పోలీసులు ప్రశ్నించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇందుకు స్థానిక కాలనీల్లో కాన్వాసింగ్ నిర్వహించారు. అయితే ఇది గ్యాంగ్ వార్ కావచ్చని పోలీసులతో పాటు స్థానిక మీడియా భావిస్తోంది. గన్ షూటింగ్లో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి మరో నగరంలో స్ట్రీట్ గ్యాంగ్ మెంబర్ అని నివేదికలు చెబుతున్నాయి.
ఆ ప్రాతంలో దాడులా?
అయితే ఈ ప్రాంతంలో కాల్పుల ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గ్యాంగ్ వార్స్, కాల్పులు జరగడం చాలా అరుదు. గతంలో 1990ల్లో మాత్రమే చివరిసారి కాల్పుల ఘటన నమోదైంది. ఇంగ్ల్వుడ్ డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌కు ఆగ్నేయంగా 10 మైళ్లు (16 కిమీ) దూరంలో ఉంది. ఈ నగరం జనాభా దాదాపు 1,00,000 వరకు ఉంటుంది. ఇక్కడ ప్రఖ్యాత SoFi స్టేడియం ఉంది. వచ్చే నెలలో ఈ స్టేడియంలో రగ్బీ లాంటి ఫేమస్ స్పోర్ట్ అయిన ‘సూపర్ బౌల్’ టోర్నీ జరగనుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.