హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Capitol On Lockdown: యూఎస్ కేపిటల్‌లో లాక్‌డౌన్... అనూహ్య సంఘటనతో...

US Capitol On Lockdown: యూఎస్ కేపిటల్‌లో లాక్‌డౌన్... అనూహ్య సంఘటనతో...

యూఎస్ కేపిటల్‌లో లాక్‌డౌన్ (image credit - twitter)

యూఎస్ కేపిటల్‌లో లాక్‌డౌన్ (image credit - twitter)

US Capitol On Lockdown: జనవరి ఘటన తర్వాత యూఎస్ కేపిటల్‌లో భద్రతను మరింత పెంచారు. అలాంటి చోట తాజాగా ఏం జరిగింది? ఎందుకు లాక్‌డౌన్ విధించారు?

US Capitol On Lockdown: అది శుక్రవారం. మధ్యాహ్నం 12 దాటింది. వాషింగ్టన్ యూఎస్ క్యాపిటల్ గ్రౌండ్ కాంప్లెక్స్ ఏరియా... ఓ బ్లూ సెడాన్ కారు వేగంగా దూసుకొస్తోంది. యూఎస్ కేపిటల్ సెక్యూరిటీ పోలీసులు దాన్ని చూశారు... "హేయ్ ఆగు" అంటుంటే... ఆ కారు దూసుకొచ్చి... పోలీసుల మీద నుంచి వెళ్లిపోయి... కాంప్లెక్స్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో... ఓ పోలీస్ చనిపోగా... మరో పోలీస్ గాయపడ్డారు. చనిపోయిన పోలీస్ 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. "వాహనంలోంచీ కిందకు దూకిన ఓ వ్యక్తి... కత్తితో మిగతా సెక్యూరిటీ పోలీసులపైకి దూసుకొస్తుంటే... పోలీసులు కాల్పులు జరిపారు. అతన్ని కాల్చి చంపారు" అని తాత్కాలిక చీఫ్ యోగానంద పిట్‌మాన్ తెలిపారు. గుడ్ ఫ్రైడే (Easter) హాలిడే సందర్భంగా... అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden), ఫస్ట్ లేడీ జిల్ బిడెన్... క్యాంప్ డేవిడ్ దగ్గర వేడుకల్లో పాల్గొన్నారు. వాహనం ఘటనను తెలుసుకొని జో బిడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన పోలీసు విలియం ఇవాన్స్ కుటుంబానికి సంతాపం తెలిపారు. "జిల్, నేను ఆ హింసాత్మక ఘటన గురించి తెలుసుకొని... ఎంతో భారమైన హృదయంతో ఉన్నాం." అని బిడెన్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. వైట్‌హౌస్ జెండాలను అవనతం (సగానికి దింపడం) చెయ్యమని ఆదేశించారు. పరిస్థితులు బాలేవన్న బిడెన్... యూఎస్ క్యాపిటల్ దగ్గర ఉద్యోగం చెయ్యడం, దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరికీ సమస్యగా మారింది అన్నారు.

ఇంతకీ ఈ దారుణానికి పాల్పడింది ఎవరు అన్నదానిపై అమెరికా మీడియా నోవా గ్రీన్ అని చెబుతోంది. 25 ఏళ్ల ఆ నల్ల జాతీయుడు... ఇండియానాకు చెందిన వాడనీ... అతనికి బ్లాక్ నేషనలిస్ట్ నేషన్ ఆఫ్ ఇస్లామ్ ఉద్యమంతో సంబంధం ఉందని అంటోంది. అతను ఇలా ఎందుకు చేశాడో వెంటనే చెప్పలేం అని యోగానంద పిట్‌మాన్ తెలిపారు. "ఇది ఉగ్రవాద చర్యగా చెప్పలేం. కానీ దర్యాప్తు జరుపుతాం" అని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ రాబెర్ట్ కాంటీ తెలిపారు.

నోవా గ్రీన్... కొన్నాళ్లుగా అమెరికా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. అతనో నిరుద్యోగి, అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. అమెరికాను నల్లజాతీయలకు ప్రధాన శత్రువుగా అతను తన పోస్టుల్లో చెబుతున్నాడు.

ఈ ఘటన తర్వాత కాపిటల్ కాంప్లెక్స్ దగ్గర శుక్రవారం నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ని మోహరించారు. మొత్తం క్యాపిటల్ భవనాన్ని తమ అధీనంలోకీ తీసుకున్నారు. క్యాపిటల్ భవన కిటికీల దగ్గర ఎవరూ ఉండొద్దని ఆదేశించారు. భవనంలోని వారు బయటకు రావొద్దనీ, బయటి నుంచి ఎవరూ లోపలికి వెళ్లొద్దని ఆర్డర్ వేశారు.

ఇది కూడా చదవండి: Type 2 Diabetes: డయాబెటిస్‌కి సోంపు గింజలతో చెక్... ఎలా వాడాలి?

Memory of January 6:

జనవరి 6న ఇలాగే క్యాపిటల్ భవనంపై పెద్ద దాడి జరిగింది. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)... చేసిన ప్రసంగంతో రెచ్చిపోయిన ఆయన మద్దతు దారులు... క్యాపిటల్ భవనంపై దాడి చేశారు. భవనం గోడలపై నుంచి పైకి ఎక్కారు. ట్రంప్‌కి మద్దతుగా నినాదాలు చేశారు. అమెరికా చరిత్రలో అదో ప్రమాదకర ఘటనగా రికార్డులకెక్కింది. ఆ ఘటనలో ఓ క్యాపిటల్ పోలీస్ ఆఫీసర్ చనిపోగా... మరో నలుగురు గాయపడ్డారు. అప్పటి నుంచి ట్రంప్ మద్దతుదారులు లేదా... తీవ్ర ఆలోచనలు ఉన్న రైట్ గ్రూప్స్ (extreme-right groups) నుంచి అపాయం ఉంది అని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 300 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. తాజాగా క్యాపిటల్ భవన సెక్యూరిటీని కాస్త తగ్గించారు. ఐతే... భవనం చుట్టూ ఉన్న పోలీసుల సంఖ్యను మాత్రం అలాగే ఉంచారు.

First published:

Tags: America, Joe Biden