హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

చైనాకు మరో షాకిచ్చిన అమెరికా.. విద్యార్థుల వీసాలు రద్దు

చైనాకు మరో షాకిచ్చిన అమెరికా.. విద్యార్థుల వీసాలు రద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూఎస్ విశ్వవిద్యాలయాలలో చేరిన కొంతమంది చైనా విద్యార్థులు.. తమకు అమెరికా నుంచి బుధవారం ఈ-మెయిల్ నోటీసులు వచ్చాయని చెప్పారు.

చైనాకు మరో షాకిచ్చింది అమెరికా. చైనా విద్యార్థులు, పరిశోధకులను తమ దేశంలోకి అనుమతించకుండా నిరోధించే ప్రక్రియకు అమెరికా ప్రభుత్వం బుధవారం అంగీకారం తెలిపింది. సుమారు వెయ్యిమందికి పైగా చైనా జాతీయుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ భద్రతకు విఘాతం కలిగించే శక్తులను తమ దేశంలోకి అనుమతించేది లేదని మే 29న యూఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ముఖ్య కార్యదర్శి ఛాడ్ వోల్ఫ్ దీనిపై స్పందించారు.

"కొంతమంది చైనీస్ విద్యార్ధులు, పరిశోధకులు చైనా ఆర్మీకి సున్నితమైన అంశాలను చేరవేస్తున్నారు. ఇలాంటివారు ఆ దేశ సైనికాధికారులతో వ్యూహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నారు. మా దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు చేరకుండా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం పనికొస్తుంది" అని ఆయన వివరించారు.

కరోనావైరస్ పరిశోధనలకు సంబంధిచిన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలతో సహా, అసామాన్య వ్యాపార పద్ధతులు, పారిశ్రామిక గూఢచర్యం వంటి తప్పుడు ఉద్దేశాలతో అమ దేశంలోకి ప్రవేశించి విలువైన విద్యా సంపదను చైనా దేశీయులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింలను వేధింపులకు గురిచేస్తున్న వైనాన్ని వోల్ఫ్ ప్రస్తావించారు. బానిస కార్మికులు ఉత్పత్తి చేసిన వస్తువులను తమ మార్కెట్లలోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పారు.

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యంపై చైనా ఆగడాలను అరికట్టడానికి అమెరికా ఇలా స్పందించిందని, ఇందులో భాగంగానే మే 29 న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రకటన కింద వీసా చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారిని తెలిపారు. సెప్టెంబర్ 8, 2020 నాటికి, ప్రెసిడెంట్ ప్రొక్లెయిమేషన్ 10043 కు లోబడి ఉన్నట్లు గుర్తించిన 1,000 కి పైగా పీఆర్సీ జాతీయుల వీసాలను డిపార్ట్మెంట్ రద్దు చేసినట్టు ఆమె వివరించారు. చైనా నుంచి యూఎస్కు వస్తున్న వారిలో హై-రిస్క్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధనలు చేసేవారిని మాత్రమే వేరుచేస్తున్నారని, చట్టబద్ధమైన విద్యార్థులు, స్కాలర్లు ఎప్పటిలాగే యూఎస్కు రావచ్చని ఆమె వివరించారు.

మరోవైపు అమెరికాలో తమ విద్యార్థులపై విధిస్తున్న ఆంక్షలను చైనా ఖండించింది. ప్రస్తుత సెమిస్టర్లో కొవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యార్ధులు క్యాంపస్కు వెళ్లలేకపోయినప్పటికీ 3,60,000 మంది చైనీస్ విద్యార్థుల ద్వారా అక్కడి కళాశాలలకు గణనీయమైన ఆదాయం వచ్చింది. ట్రేడ్ వార్, హాంగ్ కాంగ్పై ఆంక్షలు, కరోనా వైరస్ వంటివి అమెరికా, చైనా మధ్య దూరాన్ని మరింత పెంచాయి. చైనాతో ఉన్న భారీ వాణిజ్య లోటును పూడ్చేందుకే చైనా వ్యాపారాలపై ఆంక్షలు విధించినట్టు ట్రంప్ చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయం చెబుతున్నారు. తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్ మాత్రం బీజింగ్ పట్ల మృదువుగా వ్యవహరిస్తున్నారు

యూఎస్ విశ్వవిద్యాలయాలలో చేరిన కొంతమంది చైనా విద్యార్థులు.. తమకు అమెరికా నుంచి బుధవారం ఈ-మెయిల్ నోటీసులు వచ్చాయని చెప్పారు. బీజింగ్‌లోని ఎంబసీ లేదా చైనాలోని యుఎస్ కాన్సులేట్లు తమ వీసాలు రద్దు చేసినట్లు వాటి సారాంశం. పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లతో సహా ఎఫ్ -1 అకడమిక్ వీసాలు కలిగి ఉన్న దాదాపు 50 మంది విద్యార్థులు వీచాట్ చాట్ రూమ్‌లో మాట్లాడుతూ... వారు అమెరికా వెళ్లాలనుకుంటే కొత్త వీసాల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నట్లు వివరించారు.

First published:

Tags: America, China, Us news

ఉత్తమ కథలు