పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ షాకిచ్చింది. ఆ దేశం నుంచి అమెరికాకు రాకపోకలు సాగించే అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. పాకిస్తాన్ పైలట్లలో ఎక్కువ మంది ఫేక్ డిగ్రీలతో జాబ్ పొందిన వారే ఉన్నారని.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో అమెరికా మూడో వంతు పైలట్లను విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తప్పుడు ధృవపత్రాలతో పైలట్ జాబ్ పొందారన్న కారణాలతో వారిని తొలగించింది.
అటు యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ సైతం పాకిస్తాన్ అంతర్జాతీయ విమానాలపై ఆరు నెలల పాటు నిషేధం విధించింది. ఐతే అమెరికా నిర్ణయంపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, మే 22న కరాచీలో పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 97 మంది మరణించారు. ప్రమాదానికి పైలట్ల నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తులో తేలింది. అంతేకాదు పాకిస్తాన్‌లో విమానాలు నడుపుతన్న పైలట్ల నకిలీ బాగోతం కూడా బయటపడింది. ఈ క్రమంలో పలు దేశాలు పాకిస్తాన్ విమానాపై నిషేధం విధిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.