US AT LEAST 23 KILLED AFTER TORNADO HAMMERS ALABAMA
అమెరికాలో టోర్నడో బీభత్సం...23 మంది దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం (Image: AP)
అలబామా రాష్ట్రంలో సంభవించిన టోర్నడో బీభత్సంలో 23 మంది మృతి చెందగా..పలువురు గల్లంతు అయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రిస్క్యూ టీమ్లు డ్రోన్స్ సాయంతో గాలిస్తున్నాయి.
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. వివిధ ఘటనల్లో 23 మంది దుర్మరణం చెందగా..వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. టోర్నడో బీభత్సంలో పలవురు గల్లంతు అయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రిస్క్యూ టీమ్లు డ్రోన్స్ సాయంతో గాలిస్తున్నాయి. వివిధ ఘటనల్లో గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో గత ఆరేళ్లలో సంభవించిన అతిపెద్ద టోర్నడో ఇదేనని అంచనావేస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టలేదు. గాలింపు చర్యలు పూర్తయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
తీవ్ర తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. భారీ ఈదురుగాలులకు అనేక చోట్ల ఇళ్లు ధ్వంసంకాగా, చెట్లు నేలకూలాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు నేలకూలాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకటి అలుముకుంది. భారీ వృక్షాలు నేలకూలడంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. జార్జియా, ఫ్లోరిడా, దక్షిణ కరోలినాలోనూ టోర్నడో హెచ్చరికలు వెలువడ్డాయి.
టోర్నడో తీవ్రతను ఎఫ్3గా నిర్ధారించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 254-331 కిలో మీటర్ల మధ్య గాలుల తీవ్రతను ఎఫ్3గా పరిగణిస్తారు. ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలబామా గవర్నర్ కే ఇవీ సూచించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.