ఇండియాను "రేపిస్థాన్‌" అంటున్న అర్బన్ డిక్షనరీ... నెటిజన్ల ఫైర్...

మనకు ఏదైనా పదం అర్థం తెలియకపోతే... డిక్షనరీలో చూసుకుంటాం. ఎందుకంటే... డిక్షనరీలో ఆ పదానికి సరైన అర్థం ఉంటుందని. అలాంటిది డిక్షనరీయే తప్పుగా వివరణ ఇస్తే... ఇంకేం చెయ్యాలి?

Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 11:25 AM IST
ఇండియాను
ఇండియాపై వివాదాస్పద నిర్వచనం (Image : Twitter - Urban Dictionary)
Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 11:25 AM IST
అర్బన్ డిక్షనరీని 1999లో ఆరన్ పెక్హామ్ ప్రారంభించారు. ప్రస్తుతం దాన్ని లక్షల మంది యువత వాడుతున్నారు. ఎందుకంటే... ఎప్పటికప్పుడు అందులో కొత్త కొత్త పదాలు యాడ్ అవుతూ ఉంటాయి. అప్ టు డేట్‌గా ఉంటుంది. ప్రజలు సెటైర్లు వేసేటప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు... కొత్త కొత్త పదాలు వాడుతుంటారు. అలాంటి వాటిని ఈ డిక్షనరీలో ఎప్పటికప్పుడు చేరుస్తుంటారు. అందువల్ల ఇది యువతకు బాగా నచ్చుతోంది. నిజానికి ఇది సరైన డిక్షనరీ కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే... డిక్షనరీ డాట్ కామ్‌కి ఇది స్పూఫ్ లాంటిది. ఇప్పటికే చాలా విషయాల్లో వివాదాస్పదమైన అర్బన్ డిక్షనరీ... తాజాగా... ఇండియా అంటే "రేపిస్థాన్" అని అభివర్ణించిది. ఇండియాతోపాటూ... ప్రపంచ దేశాలనూ ఆశ్చర్యపరుస్తోంది.

ట్విట్టర్ యూజర్ నిదా మాలిక్... రేపిస్థాన్ అంటే ఏంటని అడిగారు. దీనిపై స్పందించిన అర్బన్ డిక్షనరీ... రేపిస్థాన్ అంటే... హిందుస్థాన్ లేదా ఇండియా అని చెప్పింది. ఇండియాలో ఏడాది వయసున్న బాలికల్ని కూడా రేప్ చేస్తారని తెలిపింది. ఇండియాలో మహిళల కంటే... ఆవులకే ఎక్కువ రక్షణ, గౌరవం ఉంటుందని అభివర్ణించింది.
అర్బన్‌డిక్షనరీ డాట్ కామ్ అనేది... క్రౌడ్ సోర్స్ వెబ్‌సైట్... అంటే... ఏ యూజరైనా... ఏ పదానికైనా నిర్వచనం చెప్పవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఏ పదమైనా చాలా వేగంగా... కనిపెట్టి దాని అర్థం చెబుతుంది. దానిపై యూజర్లు తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఆ పదాలకు డిస్క్రిప్షన్ ఇవ్వొచ్చు. ఇండియా నిర్వచనం విషయంలోనూ ఇదే జరిగింది. ఛాన్స్ ఉంది కదా అని యూజర్లు... పదాలకు ఇష్టమొచ్చినట్లు నిర్వచనాలు ఇచ్చేస్తున్నారు.
Loading...
గతేడాది రాయిటర్స్ వార్తా సంస్థ కూడా ఇండియాను రక్షణ లేని దేశంగా అభివర్ణించింది. ఇండియాలో మహిళలు రేప్, లైగింక వేధింపుల బారిన పడుతుంటారని తెలిపింది. ఐక్యారాజ్యసమితి కూడా దాదాపు ఇలాంటి రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. అందులో 95 శాతం మంది భారతీయ మహిళలు... ఇండియాను రక్షణ లేని దేశంగా భావిస్తారని తెలిపింది.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...