సంపన్నుల చూపులన్నీ వాటిపైనే... కొత్త పరిశోధనలో ఆసక్తికర అంశాలు...

Rich and Poor : జనరల్‌గా ఎవరైనా తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో, ఎవరు వచ్చి, పోతున్నారో గమనిస్తూ ఉంటారు. అది అవసరం కూడా. కానీ... సంపన్నులు తమ చుట్టూ ఉన్నవారిని పట్టించుకోరని పరిశోధనలో తేలింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 12:59 PM IST
సంపన్నుల చూపులన్నీ వాటిపైనే... కొత్త పరిశోధనలో ఆసక్తికర అంశాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణ, మధ్యతరగతి, వర్కింగ్ క్లాస్ ప్రజలతో పోల్చితే... ధనవంతులు... తమ చుట్టూ ఉన్న వారిని పెద్దగా పట్టించుకోరని పరిశోధనలో తేలింది. అసోసియేషన్ ఫర్ సైకలాజికల్ సైన్స్ జర్నల్‌లో ఈ విషయాల్ని ప్రచురించారు. న్యూయార్క్ యూనివర్శిటీ పరిశోధకులు... ఈ పరిశోధన చేశారు. ఇతరుల్ని ఎవరు ఎంతవరకూ లెక్కలోకి తీసుకుంటారన్నదాన్ని పరిశీలించారు. ఈ పరిశోధనలో మూడు అంశాలున్నాయి. మొదటి అంశంలో... న్యూయార్క్ రోడ్లపై సాధారణ, మధ్యతరగతి ప్రజలు... ఇతరుల్ని, తమ ఎదురుగా వచ్చేవారి మొహాలను కళ్లతో కొన్ని క్షణాలైనా చూస్తున్నారు. ధనవంతులు మాత్రం... చుట్టుపక్కల ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిసింది.


రెండో అంశంలో... సాధారణ, మధ్యతరగతి, వర్కింగ్ క్లాస్ ప్రజలు... ఇతరులు, వారి నడక, నడత, తీరును ఎక్కువగా పరిశీలిస్తుంటే... సంపన్నులు మాత్రం... మనుషుల్ని కాకుండా... చుట్టుపక్కల వస్తువులు, షాపింగ్ మాళ్లలో ఖరీదైన వాటిని ఎక్కువగా చూస్తున్నారని తెలిసింది.మూడో అంశంలో... సాధారణ, మధ్యతరగతి ప్రజలు... ఇతరుల మొహాల్లో హావభావాల్ని బాగా గుర్తించగలుగుతున్నారు. ధనవంతులు మాత్రం... హావభావాల్ని ఏమాత్రం గుర్తించలేకపోతున్నారు. కారణం... వారికి ఆసక్తి లేకపోవడమేనని పరిశోధనలో తేలింది.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>