వైరల్ వీడియో.. భార్యతో నవాజ్ షరీఫ్ ఆఖరి మాటలు..!

అవినీతి కేసులో జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యం పెరోల్‌పై విడుదలయ్యారు. 6 గంటల పెరోల్ లభించడంతో జైలు నుంచి బయటకొచ్చారు. అంత్యక్రియలు ముగిసే వరకు పెరోల్ గడువును పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 12, 2018, 12:19 PM IST
వైరల్ వీడియో.. భార్యతో నవాజ్ షరీఫ్ ఆఖరి మాటలు..!
ఆస్పత్రిలో నవాజ్ షరీఫ్ (Image: ANI Digital/Twitter)
  • Share this:
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ అంత్యక్రియలు ఇవాళ లాహోర్‌లో జరగనున్నాయి. అవినీతి కేసులో జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యం పెరోల్‌పై విడుదలయ్యారు. 6 గంటల పెరోల్ లభించడంతో జైలు నుంచి బయటకొచ్చారు. అంత్యక్రియలు ముగిసే వరకు పెరోల్ గడువును పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐతే లండన్ ఆస్పత్రిలో చివరిసారిగా కుల్సూమ్‌తో భర్త నవాజ్, కూతురు మర్యం మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అవినీతి కేసులో జైలుకు వెళ్లడానికి ముందు లండన్‌లో ఉన్నారు నవాజ్ షరీఫ్. ఆస్పత్రిలో కుల్సూమ్‌కు డాక్టర్లు అందిస్తున్న వైద్య చికిత్సలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఒక రోజు భార్య పక్కన నిలబడిన నవాజ్..ఆమెతో మాట్లాడారు. కుల్సూమ్‌తో నవాజ్ మాట్లాడిన ఆఖరి మాటలు అవేనని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను సయ్యద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశారు.

కుల్సూమ్ కళ్లు తెరువు. ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడు. అల్లా నీకు శక్తిని ప్రసాదిస్తాడు.
నవాజ్ షరీఫ్

ఆమె కూతురు మర్యం మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్మా..కళ్లు తెరువు. నేను అబూని. నీకు వినబడుతోందా..?
మర్యం షరీఫ్

ఐతే నవాజ్‌ కళ్లు తెరవమని చెప్పినప్పుడు, కుల్సూమ్ కొన్నిసెకన్ల పాటు కళ్లు తెరిచారని నవాజ్ తమ కుటుంబ సభ్యులతో చెప్పారట. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్యను వదలివెళ్లేందుకు మనసు ఒప్పుకోలేదని బాధపడ్డారట. కాగా, నవాజ్ భార్య కుల్సుమ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ..లండన్ ఆస్పత్రిలో మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
First published: September 12, 2018, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading