హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌పై ఐరాస భద్రతా మండలి తీర్మానం.. కీ పాయింట్లు

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌పై ఐరాస భద్రతా మండలి తీర్మానం.. కీ పాయింట్లు

ఆఫ్ఘనిస్థాన్‌పై ఐరాస భద్రతా మండలి తీర్మానం (File Image)

ఆఫ్ఘనిస్థాన్‌పై ఐరాస భద్రతా మండలి తీర్మానం (File Image)

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను అలా పూర్తిగా తాలిబన్ల చేతిలో పెట్టేయకుండా అప్రమత్తమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఓ తీర్మానం చేసింది. అదేంటో చూద్దాం.

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయాయి. రేపటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబనిస్థాన్ అయిపోతుంది. ఇక తాలిబన్లు రెచ్చిపోతారు. ఆల్రెడీ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి. ఇలాంటి సమయంలో... అమెరికా దళాలు వెళ్లిపోయాయి. కాబట్టి ఇక తాలిబన్లు తమకు ఎదురేలేదని అనుకుంటున్నారు. ఇలా వాళ్లను పూర్తిగా వదిలేస్తే... మళ్లీ ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉండటంతో... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఓ తీర్మానం (Resolution) చేసింది. దాన్లో కీలక పాయింట్లు ఇలా ఉన్నాయి.

తీర్మానంలో కీలక పాయింట్లు:

* ఆఫ్ఘనిస్థాన్‌ను ఉగ్రవాదులు వాడుకోవడానికి వీల్లేదు.

* ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల పోరు కొనసాగుతుంది.

* ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు, పిల్లలు, మైనార్టీలకు రక్షణ ఉండాలి.

* తాలిబన్లు ప్రపంచ దేశాలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలి

ఐరాస తీర్మానం సారాంశం:

ఆఫ్ఘనిస్థాన్‌పై ఇదివరకు ఐరాస చేసిన తీర్మానాల్ని మరోసారి భద్రతా మండలి నిన్న చర్చించింది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఓ దేశంగా భావిస్తూ దాని సార్వభౌమత్వాన్నీ, స్వతంత్రతను, భౌగోళికతను, జాతీయతా భావాన్ని కాపాడాలి అనుకుంది. ఆగస్ట్ 26న కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగిన ఉగ్రదాడిని మండలి ఖండించింది. ఈ దాడిని తాలిబన్లు ఖండించిన విషయాన్ని భద్రతా మండలి ప్రస్తావించింది.

ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలో ఉగ్ర కార్యకలాపాలు చేపట్టకూడదని భద్రతామండలి తీర్మానించింది. ఏ దేశం కూడా ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వకూడదని చెప్పింది. ట్రైనింగ్ కార్యకలాపాలు జరగనివ్వకూడదని తెలిపింది. అలాగే ఉగ్ర కార్యకలాపాలకు నిధులు ఇవ్వకూడదని చెప్పింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో మానవతా చర్యలు, సేవల్ని కొనసాగించాలని భద్రతా మండలి తీర్మానించింది. ఐరాస ఏజెన్సీలు, భాగస్వామ్యాలు... ఆఫ్ఘనిస్థాన్‌లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని మండలి తీర్మానించింది. ప్రపంచ దేశాలు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరింది. పౌరులకు రక్షణ కల్పించాలని పిలుపు ఇచ్చింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కుల్ని కాపాడే విషయంలో నిబద్ధతగా ఉంటామని భద్రతా మండలి తెలిపింది. సమస్యల్ని రాజకీయపరంగా పరిష్కరించాలని కోరింది. అన్ని రంగాల్లో మహిళలకు సమాన ప్రాధాన్యం ఉండేలా చేస్తామంది.

ఆఫ్ఘన్లు ఎప్పుడైనా విదేశాలకు వెళ్లి, స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు ఉండాలనీ, ఈ విషయంలో తాలిబన్లు అడ్డంకులు సృష్టించకూడదని భద్రతా మండలి కోరింది. ఏ సరిహద్దు నుంచైనా వారు స్వేచ్చగా ఇతర దేశాలకు వెళ్లేందుకు వీలు కల్పించాలని సూచించింది. కాబూల్ ఎయిర్‌పోర్టులో ఎవరైనా స్వేచ్ఛగా వెళ్లేలా, స్వేచ్చగా ప్రయాణించేలా తాలిబన్లు చెయ్యాలని ఆదేశించింది.

కాబూల్ ఎయిర్‌పోర్టు దగ్గర మరిన్ని ఉగ్ర దాడులు కొనసాగవచ్చన్న అమెరికా హెచ్చరికలపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబన్లు అంతర్జాతీయ భద్రత, నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తూ... కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి మార్కెట్ రేట్లు ఇవీ!

తీర్మానం బాగానే ఉన్నా... తాలిబన్లు ఎంతవరకూ పద్ధతిగా ఉంటారన్నది అనుమానమే. అసలే వారి దగ్గర ఇప్పుడు అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇదివరకు అమెరికాకు సహకరించిన వారిని వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అమ్మాయిలపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అందువల్ల వారి మాటలు నమ్మే పరిస్థితి కనిపించట్లేదు.

First published:

Tags: Afghanistan, Taliban

ఉత్తమ కథలు