వంతెనగా మారిపోయిన చీమలు... వైరల్ వీడియోపై ప్రశంసల జల్లు...

2014లో ఓ సర్వే జరిగింది. చీమలు తమ మెడ జాయింట్ దగ్గర తమ బరువు కంటే... 5000 రెట్లు ఎక్కువ బరువు మొయ్యగలవని ఆ సర్వేలో తెలిసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 9:53 AM IST
వంతెనగా మారిపోయిన చీమలు... వైరల్ వీడియోపై ప్రశంసల జల్లు...
వంతెనలా మారిన చీమలు (Source - Twitter - Swati Lakra IPS)
  • Share this:
ఐకమత్యమే మహా బలం అన్న విషయం మనందరికీ తెలుసు. చీమల్లో యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అవి ఏ పనిచేసినా అన్నీ కూడగట్టుకొని చేస్తాయి. ఎంతో శ్రమిస్తాయి. కష్ట జీవులుగా వాటికి పేరుంది. మరోసారి చీమలు తమ పనితనాన్ని నిరూపించుకున్నాయి. టీమ్ వర్క్‌తో అద్భుతాన్ని సృష్టించాయి. మహిళా రక్షణ కోసం అహరహం శ్రమిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతీ లక్రా... ఓ వీడియో షేర్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. 14 సెకండ్ల ఆ వీడియోలో... కొన్ని చీమలు కలిసి... ఓ వంతెనను నిర్మించాయి. చీమలే వంతెనగా మారిపోయాయి. ఇతర చీమలు... ఆ చీమలపై నుంచీ దాటుకుంటూ వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ వీడియోని చాలా మంది షేర్ చేస్తున్నారు. స్వాతి లక్రాకు ఉన్న 48 వేల మంది షాలోయర్లు దీన్ని చూసి చీమల్ని మెచ్చుకుంటున్నారు.


సెప్టెంబర్ 12న పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 5.5వేల లైక్స్ వచ్చాయి. చాలా మంది దీన్ని చూసి తమ కామెంట్లు పెడుతున్నారు. అదిరిపోయిందని కొందరు, టీమ్ వర్క్ సూపర్ అని మరికొందరు ఇలా రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు.


2014లో ఓ సర్వే జరిగింది. చీమలు తమ మెడ జాయింట్ దగ్గర తమ బరువు కంటే... 5000 రెట్లు ఎక్కువ బరువు మొయ్యగలవని ఆ సర్వేలో తెలిసింది. కొలంబస్‌లోని ఒహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు ఆ రీసెర్చ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని బయోమెకానిక్స్ జర్నల్‌లో రాసివుంచారు.
Published by: Krishna Kumar N
First published: September 16, 2019, 9:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading