పాకిస్తానీలకు వీసా... మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ చెప్పిన అమెరికా

అమెరికాలో ఉండే పాకిస్తాన్ అధికారులు తాము నివసిస్తున్న ప్రాంతానికి లేదా ఉద్యోగం చేస్తున్న ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయడానికి వీల్లేదని కండిషన్ విధించారు.

news18-telugu
Updated: March 6, 2019, 11:34 AM IST
పాకిస్తానీలకు వీసా... మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ చెప్పిన అమెరికా
డొనాల్డ్ ట్రంప్ (Getty Images)
  • Share this:
పాకిస్తానీలకు వీసా విషయంలో అగ్రరాజ్యం అమెరికా మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ చెప్పింది. వారికి వీసా గడువు గణనీయంగా తగ్గించింది. గతంలో పాకిస్తాన్ పౌరులకు ఇచ్చే వీసా గడువు ఐదేళ్ల పరిమితి ఉండేది. అయితే, ఈ సారి ఆ వీసా గడువును కేవలం మూడు నెలలకు మాత్రమే పరిమితి విధిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుందని ARY NEWS కథనాన్ని ప్రచురించింది. అమెరికన్ ఎంబసీ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఈ కథనాన్ని వెలువరించింది. ఇది పాకిస్తాన్ పౌరులు, జర్నలిస్టులకు కూడా వర్తించనుంది. మరోవైపు వీసా అప్లికేషన్ ఛార్జిలను కూడా పెంచింది. గతంలో వీసాకు దరఖాస్తు చేసుకునే పాకిస్తానీలు 160 డాలర్లు చెల్లించాల్సి ఉండేది. దాన్ని 192 డాలర్లకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది.

pakistan, united states, us embassy, washington, Pakistan Visa, US Visa for Pakistan, Imran Khan, Donald Trump, పాకిస్తాన్, పాకిస్తానీలకు అమెరికా వీసా, అమెరికా వీసా పాకిస్తాన్, వాషింగ్టన్, అమెరికా ఎంబసీ, అమెరికా వీసా నిబంధనలు
డొనాల్డ్ ట్రంప్ ఫైల్ ఫోటో (Image: AP)


పాకిస్తాన్ అనుసరిస్తున్న వీసా, రుసుము నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా అధికారవర్గాలు చెబుతున్నాయి. అమెరికా పౌరులకు వీసా గడువు కాలాన్ని తగ్గిస్తూ ఇటీవల పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులే కాకుండా ఆ దేశ అధికారులకు కూడా కొన్ని షరతులు విధిస్తూ గత మే నెలలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి కౌంటర్‌గా ఇప్పుడు అమెరికా ఏకంగా భారీ షాక్ ఇచ్చింది.

pakistan, united states, us embassy, washington, Pakistan Visa, US Visa for Pakistan, Imran Khan, Donald Trump, పాకిస్తాన్, పాకిస్తానీలకు అమెరికా వీసా, అమెరికా వీసా పాకిస్తాన్, వాషింగ్టన్, అమెరికా ఎంబసీ, అమెరికా వీసా నిబంధనలు
ఇమ్రాన్‌ఖాన్, ట్రంప్ ( ఫైల్)
పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే క్రమంలో మరికొన్ని కీలక డెసిషన్స్ తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో ఉంటున్న పాకిస్తాన్ అధికారులు (డిప్లొమాట్స్) ఎవరూ తాము నివసిస్తున్న ప్రాంతానికి లేదా ఉద్యోగం చేస్తున్న ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయడానికి వీల్లేదని కండిషన్ విధించారు.
First published: March 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>