US News: ఆఫ్ఘ‌న్‌ల కోసం స్పాన్సర్ సర్కిల్ ప్రోగ్రామ్ : అమెరికా

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

US News: ఆప‌రేష‌న్ అలైస్ వెల‌క‌మ్‌(Operation Allies Welcome) కార్య‌క్ర‌మంలో భాగంగా తీసుకొచ్చిన ఆఫ్ఘ‌న్‌ల‌కు పున‌రావాసం క‌ల్పించేందుకు అమెరిక‌న్ ప్ర‌భుత్వం స్పాన్సర్ సర్కిల్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించింది. దీని ద్వారా ఆఫ్ఘ‌న్‌ల‌కు మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తామ‌ని యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లికెన్ (Blinken) పేర్కొన్నారు. 

 • Share this:
  ఆప‌రేష‌న్ అలైస్ వెల‌క‌మ్‌(Operation Allies Welcome) కార్య‌క్ర‌మంలో భాగంగా తీసుకొచ్చిన ఆఫ్ఘ‌న్‌ల‌కు పున‌రావాసం క‌ల్పించేందుకు అమెరిక‌న్ (America) ప్ర‌భుత్వం స్పాన్సర్ సర్కిల్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించింది. దీని ద్వారా ఆఫ్ఘ‌న్‌ల‌కు మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తామ‌ని యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లికెన్ (Blinken) పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, బిడెన్ పరిపాలన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తను ఆఫ్ఘ‌న్‌లో నియమించింది.  ఆమె ఎలిజబెత్ జోన్స్ (Elizabeth jones). ఆమె ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)లో పునరావాసం మరియు పునరావాసం కోసం ప్రయత్నాలను నడిపించడానికి ఎంతో కృషి చేస్తున్నట్టు అమెరిక‌న్‌ (American) ప్ర‌భుత్వం పేర్కొంది.

  ఆఫ్గ‌న్‌లో ఆహా సంక్షోభం..
  అఫ్గానిస్థాన్‌లో ఆహార సం క్షోభం తీవ్రరూపం దాల్చింది. దేశంలో ఇప్పటికే లక్షల మందికి పూర్తి స్థాయిలో తిం డి దొరకక పస్తులు ఉంటున్నారు. దీనిపై ఇప్ప‌టికే ప‌లు అం తర్జాతీయ సంస్థ‌లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ శీతాకాలంలో దాదాపు సగం మం ది అఫ్గాన్‌వాసులు తీవ్ర ఆహార సం క్షోభాన్ని ఎదుర్కో నున్నారని పేర్కొం టున్నా యి. తక్షణమే వీటి నుం చి బయటపడే చర్య లు చేపట్టకపోతే అఫ్గానీయుల ఆకలి కేకలతో అక్క డ దారుణ పరిస్థితులు ఏర్ప డుతాయని ఐక్య రాజ్య సమితి
  మరోసారి హెచ్చరించింది.

  India VS Pakistan: భారత్​పై పాకిస్తాన్​ మంత్రుల కారు కూతలు.. పాక్​పై ఇండియా ఓడిపోవడంతో చేలరేగుతున్న మంత్రులు


  ఆఫ్గాన్‌లో ప్రతి ఇద్దరు వ్య క్తుల్లో ఒకరు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొం టున్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)తోపాటు ఐక్య రాజ్య సమితి (United Nations) అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సం స్థ (FAO) హెచ్చరించాయి. ప్రస్తుతం ఇక్క డి ప్రజలు ఫేజ్‌-3 సం క్షోభం లేదా ఫేజ్-4 ఎమర్జెన్సీ ఎదుర్కొం టున్నా రని స్ప ష్టం చేశాయి. ఫేజ్‌ 4 అం టే తీవ్ర కరవుకు దగ్గరలో ఉన్నట్లు భావిస్తారు. ఈ శీతాకాలం లో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉం దని ఆం దోళన వ్య క్తం చేశాయి.

  కొర‌వ‌డిన మ‌ద్ద‌తు..
  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పా టు చేసిన తర్వా త తాలిబన్ల నేతృత్వం లోని అఫ్గాన్‌ను అం తర్జాతీయం గా గుర్తిం చేం దుకు దాదాపు అన్ని దేశాలు వెనకాడుతున్నా యి. ఇదే సమయం లో అఫ్గాన్‌పై ప్రపం చ దేశాలు ఆర్థిక పరమైన ఆం క్షలు విధిస్తున్నా యి. వీటితోపాటు ఇస్లామిక్ స్టేట్‌ దాడులు కూడా ఎక్కు వ కావడం అఫ్గానీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోం ది. మరోవైపు వాతావరణ పరిస్థితులతో అక్క డ తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీం తో వేల మం ది పేద ప్రజలు పొట్టచేతబట్టుకుని నగరాలకు తరలిపోతున్నా రు.

  సాయం అందించాలి..
  అఫ్గాన్‌లో ఆహార భద్రత పూర్తిగా కుప్ప కూలింది. తక్షణమే చర్య లు చేపట్టకపోతే న‌ష్టం చేకూరుతుంద‌ని ప్రపంచ ఆహార కార్య క్రమం ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బియాస్లీ ఆం దోళన వ్య క్తం చేశారు. ఇంత పెద్ద ప్ర‌పంచం వారికి సరైన ఆహారం అం దిస్తామనే భరోసా కూడా ఇవ్వ లేకపోతున్నా మని ఆవేదన వ్య క్తం చేశారు. ఈనేపథ్యం లో డబ్బు రూపం లో నిధులను సత్వ రమే అందించాల్సి న అవసరం ఎంతైనా ఉందని డేవిడ్‌ బియాస్లీ అభిప్రాయపడ్డారు.
  Published by:Sharath Chandra
  First published: