ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిస్థాయిలో వెనుతిరిగాయి. కొన్ని నెలలుగా అఫ్ఘన్ నుంచి తమ సేనలను, అక్కడ తమకు ఆశ్రయం ఇచ్చిన కొందరు ఆప్ఘన్ పౌరులను అమెరికా (United States)తరలిస్తున్న అగ్రరాజ్యం.. సోమవారం ఆ పనిని పూర్తి చేసినట్టు ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం కాబూల్ నుంచి చివరి విమానం బయలుదేరినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తెలిపారు. సుమారు రెండు వారాల పాటు ఆఫ్ఘన్ నుంచి తమ సేనలను, కొంతమంది ఆఫ్ఘన్ పౌరులను తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం ఎయిర్‌లిఫ్ట్ చేపట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 26న జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది అమెరికన్ సర్వీస్ సభ్యులు, దాదాపు 169 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించారు. ఆగస్టు 15న తాలిబాన్లు (Talibans) కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తీరును అగ్రరాజ్యాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. తాము ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)నుంచి వైదొలిగిన తరువాత ఆ దేశం మళ్లీ తాలిబన్ల వశమవుతుందని అమెరికా ముందుగానే అంచనా వేసింది. అయితే ఇంత తొందరగా తాలిబన్లు ఆఫ్ఘన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారని ఊహించలేదు. దీంతో అక్కడి నుంచి వచ్చేందుకు అమెరికా వేగంగా చర్యలు చేపట్టింది. తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. అసాధారణమైన ఎయిర్‌లిఫ్ట్ ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో అమెరికా ఊహించిన విధంగానే పేలుళ్లు జరిగాయి. ఆ దాడి జరిగిన స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Joe Biden)... ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలగాల్సిన తన అభిప్రాయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. 20 సంవత్సరాల యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
20 ఏళ్ల క్రితం 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా... ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా, దాని అధినేత బిన్ లాడెన్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్‌లోకి అడుగుపెట్టింది అమెరికా. ఇందుకోసం ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆల్‌ఖైదాకు ఆశ్రయం కల్పించిన తాలిబన్ల చెర నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు విముక్తి కల్పించింది. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కాకుండా అడ్డుకుంది.ఈ ఏడాది బిడెన్ అధికారం చేపట్టే సమయానికి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న 2,500 మంది సైనికులను నిలుపుకోవాలని వాదించిన తన జాతీయ భద్రతా బృందంలోని సభ్యుల సలహాలను ఆయన పరిశీలించారు.
Afghanistan: తాలిబన్ల కొత్త రూల్.. అమ్మాయిలకు శాపం.. ఇక మళ్లీ పాత రోజులేనా ?
Sweat Benefits: వాసన భరించలేకపోయినా.. చెమటలు మంచివే.. ఎన్నో ప్రయోజనాలు.. కానీ..
కానీ ఏప్రిల్ మధ్యలో అక్కడి నుంచి సైనికులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 11 నాటికి ఆప్ఘనిస్థాన్ నుంచి వైదొలగాలని గడువుగా నిర్ణయించారు. అమెరికా సేనలు ఆప్ఘనిస్థాన్‌ను విడిచిపోవాలని నిర్ణయించిన కొద్దిరోజుల్లోనే తాలిబన్లు మళ్లీ దేశాన్ని తమ సొంతం చేసుకునేందుకు వేగంగా పావులు కదిపారు. ఆగస్టు ప్రారంభంలోనే ప్రావిన్షియల్ క్యాపిటల్స్‌తో సహా కీలక నగరాలను కూల్చివేసే దాడిని చేశారు. ఆఫ్ఘన్ సైన్యం చాలా వరకు కుప్పకూలింది. కొన్నిసార్లు తుది నిర్ణయం తీసుకోకుండా లొంగిపోయింది. ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజధాని నుండి పారిపోయిన కొద్దిసేపటికే, తాలిబాన్లు కాబూల్ (Kabul)లోకి ప్రవేశించి ఆగస్టు 15న నియంత్రణలోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Taliban