హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

మరో అద్భుతానికి అమెరికా శ్రీకారం.. లార్జెస్ట్ సబ్‌మెరైన్ నిర్మాణంలో యూఎస్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

మరో అద్భుతానికి అమెరికా శ్రీకారం.. లార్జెస్ట్ సబ్‌మెరైన్ నిర్మాణంలో యూఎస్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

అత్యంత అధునాతన అణుశక్తితో నడిచే కొలంబియా-క్లాస్‌ బాలిస్టిక్-మిసైల్‌ సబ్‌మెరైన్‌(SSBN) నిర్మాణాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) ప్రారంభించింది. యూఎస్‌ నావికాదళం కోసం జనరల్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ బోట్(GDEB) తయారు చేసిన న్యూ క్లాస్‌ SSBNలలో మొదటి నౌక USS డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కావడం విశేషం‌.

ఇంకా చదవండి ...

అత్యంత అధునాతన అణుశక్తితో నడిచే కొలంబియా-క్లాస్‌ బాలిస్టిక్-మిసైల్‌ సబ్‌మెరైన్‌(SSBN) నిర్మాణాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) ప్రారంభించింది. యూఎస్‌ నావికాదళం కోసం జనరల్ డైనమిక్స్ ఎలక్ట్రిక్ బోట్(GDEB) తయారు చేసిన న్యూ క్లాస్‌ SSBNలలో మొదటి నౌక USS డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కావడం విశేషం‌. 2021లో మొదటి రెండు కొలంబియా-క్లాస్‌ బోట్‌ల కోసం 10 బిలియన్ల డాలర్‌ల ఒప్పందంపై GDEB సంతకం కూడా చేసింది.

USS డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోసం కీల్-లేయింగ్ సెర్మనీ జూన్ 4న జరిగింది.. ఆ కార్యక్రమంలోనే న్యూ క్లాస్‌ బాలిస్టిక్-మిసైల్‌ సబ్‌మెరైన్స్‌ తయారీని అమెరికా ప్రారంభించింది. కొలంబియా-క్లాస్ ప్రోగ్రామ్‌తో నేవీ రాబోయే అరవై సంవత్సరాల అణు నిరోధకాన్ని అందించడానికి ఎలక్ట్రిక్ బోట్‌ను అప్పగించిందని GDEB అధ్యక్షుడు కెవిన్ గ్రానీ తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమమైన, అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన జలాంతర్గాములను అందించే కంపెనీ వారసత్వాన్ని కొనసాగిస్తుందని ఆయన ప్రకటన చేశారు. ఈ జలాంతర్గాములు దేశ రక్షణకు కీలకమైనవిగా కెవిన్‌ గ్రానీ పేర్కొన్నారు.

ప్రస్తుతం అమెరికా పరిధిలో.. 12 కొలంబియా-క్లాస్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. అదేవిధంగా సేవలో ఉన్న 14 ఓల్డ్‌ ఒహియో-క్లాస్ సబ్‌లు 2027లో సేవల నుంచి తప్పుకుంటాయని అధికారులు చెబుతున్నారు. కొత్త సబ్‌మెరైన్స్‌ నిర్మాణం ఇప్పటికే జరుగుతున్నందున, చైనా వంటి సముద్రగర్భ ప్రత్యర్థులపై అమెరికా తన వైఖరి కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది.

WhatsApp యూజర్లకు అలర్ట్.. మళ్లీ తెరపైకి ఓల్డ్ స్కామ్.. అప్రమత్తంగా లేకుంటే డబ్బులన్నీ గల్లంతే..!

కొలంబియా- క్లాస్ సబ్‌మెరైన్‌ల ఫీచర్లు

కొలంబియా పొడవుగా, బరువుగా ఉంటుంది. సంక్లిష్టమైన ఎలక్ట్రిక్ డ్రైవ్ ప్రొపల్షన్ సిస్టమ్, అసోసియేటెడ్‌ టెక్నాలజీ దీని కోసం ఉపయోగిస్తున్నారు.

కొలంబియా- క్లాస్ సబ్‌మెరైన్‌లు

పొడవు - 560 అడుగులు

బీమ్‌- 43 అడుగులు

డిస్‌ప్లేస్‌మెంట్‌- 20,810 టన్నులు

సర్వీస్‌ లైఫ్‌- 42 సంవత్సరాలు

16 మిసైల్స్‌ మోసుకెళ్లే శక్తి.

అంతేకాకుండా న్యూ క్లాస్‌ సబ్‌మెరైన్స్‌లో లైఫ్-ఆఫ్-షిప్ రియాక్టర్‌లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రణాళికాబద్ధమైన సర్వీస్‌ లైఫ్‌లో రియాక్టర్‌కు ఇంధనం నింపాల్సిన అవసరం లేదు. దీంతో నౌకను ఆపరేట్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుందని, ఎక్కువ సమయం మోహరించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొలంబియా- క్లాస్‌ సబ్‌మెరైన్‌లు ఒక్కొక్కటి 16 మిసైల్స్‌ను తీసుకెళ్తాయని.. ఇవి మొత్తంగా దేశం అణు ఆయుధాగారంలో 70 శాతం ప్రాతినిధ్యం వహిస్తాయని సమాచారం. కొత్త సబ్‌మెరైన్‌లలో రాయల్ నేవీకి చెందిన డ్రెడ్‌నాట్-క్లాస్ సబ్‌మెరైన్‌ల వంటి సంయుక్త-అమెరికా-బ్రిటీష్ అభివృద్ధి చెందిన కామన్ మిస్సైల్ కంపార్ట్‌మెంట్(CMC)లు ఉంటాయి.

పుతిన్ మలమూత్రాలను సేకరించేందుకు స్పెషల్‌ బాడీగార్డు.. చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

కొత్త ఓడ, కొత్త ఆయుధాలు

16 మిసైల్‌లతోపాటు, కొత్త సబ్‌మెరైన్‌లను MK 48 మోడ్ 7 టార్పెడో అప్‌గ్రేడ్ వేరియంట్‌తో లోడ్‌ చేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది.

MK 48 MOD 7 టార్పెడో

డయామీటర్‌- 21 అంగుళాలు

బరువు - 3520 పౌండ్లు

పరిధి - 5 మైళ్ళు

వేగం - 28 నాట్ల కంటే ఎక్కువarmy

ఆపరేషనల్‌ డెప్త్‌- 1,200 అడుగుల కంటే ఎక్కువ

వార్‌హెడ్ - 650-పౌండ్ల అధిక-పేలుడు పదార్థం

అప్‌గ్రేడ్ చేసిన టార్పెడో వేరియంట్‌లో స్టెల్త్ ఫీచర్లు.. సముద్రంలో జలాంతర్గాముల కంట పడకుండా కాపాడే ఫీచర్లు దీని సొంతం.

First published:

Tags: America, International news, Ship, United states

ఉత్తమ కథలు