news18-telugu
Updated: December 13, 2019, 5:30 PM IST
అసోంలో పెల్లుబికిన నిరసనలు(File Photo)
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుతో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి నిశితంగా విశ్లేషిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ అన్నారు. భారతదేశ చట్ట సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తమకు తెలుసని, అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి కూడా తమకు తెలుసని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. ఈ కొత్త చట్టం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న విషయాన్ని నిశితంగా విశ్లేషిస్తున్నామని చెప్పారు.
భారత్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై ఐరాస మానవ హక్కుల యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. అయితే ఈ చట్టంపై ఐరాస నేరుగా స్పందిస్తుందా? అన్న ప్రశ్నకు.. వేచి చూడాలని బదులిచ్చారు. ప్రస్తుతానికైతే పౌరసత్వ సవరణ చట్టంలో పొందుపరిచిన అంశాలను తాము విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఐరాస విశ్వ మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచిన అంశాలు పౌరసత్వ సవరణలో పొందుపరిచి ఉంటారని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
Published by:
Srinivas Mittapalli
First published:
December 13, 2019, 5:30 PM IST