హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UAE మరో సంచలన నిర్ణయం..ఇప్పటిదాకా ఒక లెక్క,ఇకపై ఇంకో లెక్క

UAE మరో సంచలన నిర్ణయం..ఇప్పటిదాకా ఒక లెక్క,ఇకపై ఇంకో లెక్క

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UAE Corporate Tax : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదా రియల్ ఎస్టేట్ నుంచి మూలధన లాభాల పన్నును లేదా ఇతర పెట్టుబడులపై పన్నును

UAE Will Introduce a Corporate Tax: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023 మధ్య నుండి యూఏఈలో కార్పొరేట్ పన్నును ప్రవేశపెడతున్నట్లు సోమవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గల్ఫ్ ఆర్థిక కేంద్రం, పన్ను స్వర్గధామం(Tax Heaven)గా దీర్ఘకాలంగా పిలుబడుతున్న యూఏఈ.. బహుళజాతి సంస్థల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంగా ప్రసిద్ధి చెందింది. వచ్చే ఏడాది జూన్ నుండి 9.0 శాతంతో 375,000 AED(102,000 డాలర్లు) కంటే ఎక్కువ వ్యాపార లాభాలపై పన్ను విధించనున్నట్లు ఇవాళ ఒక ప్రకటనలో యూఏఈ తెలిపింది.

అయితే వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదా రియల్ ఎస్టేట్ నుంచి మూలధన లాభాల పన్నును లేదా ఇతర పెట్టుబడులపై పన్నును ప్రవేశపెట్టే ఆలోచన లేదని మంత్రిత్వ శాఖ సృష్టం చేసింది. "కార్పొరేట్ పన్నును ప్రవేశపెట్టడంతో..పన్ను పారదర్శకత మరియు హానికరమైన పన్ను పద్ధతులను అడ్డుకోవడం కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యూఏఈ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది" అని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ యూనిస్ హాజీ అల్ ఖూరి ఒక ప్రకటనలో తెలిపారు.

ALSO READ Nato Chief : ఉక్రెయిన్ విషయంలో చేతులెత్తేసిన నాటో!రష్యా ఆక్రమణ తప్పదా?

కాగా, గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం అయ్యేందుకు వీలుగా వారాంతపు సెలవులను ఇటీవలే మారుస్తూ యూఏఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో యూఏఈలో శుక్ర,శనివారం సెలవు రోజులుగా ఉండగా…ఈ ఏడాది జనవరి-1,2022 నుంచి వారతంపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నాం 12 గంటల నుంచే ప్రారంభమయ్యేలా యూఏఈ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ALSO READ Bomb Clone: ఆ దేశాన్ని వణికిస్తున్న బాంబ్ సైక్లోన్.. 7 కోట్ల మందిపై మంచు తుఫాను ప్రభావం.. వివరాలిలా..

UAE కార్పొరేట్ పన్ను విధానం ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వం కలిగిన వాటిలో ఒకటిగా ఉంటుంది అని అధికారిక WAM వార్తా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తొమ్మిది శాతం ట్యాక్స్.. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పన్నుల దిగువ ముగింపులో ఉందని తెలిపింది.

ప్రపంచంలోనే ఒక ప్రధాన చమురు ఎగుమతిదారు మాత్రమే కాకుండా వ్యాపారం, వాణిజ్యం, రవాణా మరియు పర్యాటక రంగాలలో కూడా ముందుంది యూఏఈ..ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు, పొరుగున ఉన్న సౌదీ అరేబియా నుండి పోటీని కూడా ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియా కూడా తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి మరియు విదేశీ వ్యాపారాలను ఆకర్షించడానికి పలు కీలక నిర్ణయాలతో ముందుకెళ్తోంది.

First published:

Tags: Income tax, UAE

ఉత్తమ కథలు