• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • UNITED AIRLINES BOEING 777 PARTS FALLING FROM SKY AFTER ENGINE FAILURE VIDEOS GOES VIRAL SU

గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు.. విమానంలో 241 మంది.. వీడియో

గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు.. విమానంలో 241 మంది.. వీడియో

విమానం ఇంజిన్‌లో మంటలు.. (Photo: Reuters)

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటల చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే విమానం భాగాలు ఊడిపటడం కలకలం రేపింది.

  • Share this:
    యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటల చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే విమానం భాగాలు ఊడిపటడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికా కొలరాడోలోని డెన్వర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 328 బోయింగ్777 డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హవాయిలోని హోనోలులుకు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 241 మంది ఉన్నారు. వారిలో 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ కాగానే కుడి ఇంజిన్ పేలి మంటలు చేలరేగాయి. విహానం నుంచి శకలాలు కిందపడిపోయాయి.

    విమానం భారీ కుదుపులకు గురి అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తక్కువ ఎత్తులో ప్రయాణించిన విమానాన్ని పైలట్ తిరిగి డెన్వార్ విమానాశ్రయంలోనే సేఫ్ ల్యాండింగ్ చేశాడు. దీంతో అందులోని ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలను ఫ్లైట్‌లోని ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. అలాగే మరికొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.







    విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భారీ పేలుడు శబ్దం వినిపించిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. విమానం కుదుపులకు గురైందని.. దీంతో తాము చాలా ఆందోళన చెందామని.. ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని పేర్కొన్నాడు. విమానం కిందకు పడిపోతున్నట్టు అనిపించడంతో చాలా భయాందోళన చెందామని అన్నాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు