news18-telugu
Updated: July 5, 2019, 12:35 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర బడ్జెట్లో ఎన్ఆర్ఐలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం... భారత పాస్ పోర్టు ఉన్న ఎన్ఆర్ఐలు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఆధార్ కార్డు కావాలంటే కనీసం 180 రోజుల పాటు ఇండియాలో నివసించారు. అయితే, ఆ విధానంలో కేంద్రం మార్పులు తెచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం ఎన్ఆర్ఐలు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆధార్ కార్డు తీసుకోవచ్చు. అంటే, వెంటనే ఆధార్ కార్డు వస్తుందన్నమాట. 180 రోజులు ఆగాల్సిన అవసరం లేదు. దీంతో విదేశాల్లోచాలా రోజులుగా ఉంటున్న ఎన్ఆర్ఐలకు లబ్ధి జరగనుంది. ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని అంశాల్లో కూడా ఎన్ఆర్ఐలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు తీసుకున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 5, 2019, 12:30 PM IST