Food crisis: ఇపుడు చర్యలు తీసుకోకపోతే దాదాపు 10 లక్షల మంది పిల్లలు ప్రమాదంలో పడుతారని ఆ దేశాన్ని హెచ్చరించిన యునిసెఫ్​

ప్రతీకాత్మక చిత్రం

ఆ దేశంలో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది చిన్నారులు (children) పోషకాహార లోపంతో ఇబ్బందులను ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్‌ (UNICEF) ఇటీవల వెల్లడించింది.

  • Share this:
అప్ఘనిస్తాన్ (Afghanistan) . ప్రస్తుతం కరువు, పేదరికం (poverty(, వలసలతో సతమతమవుతోంది. అప్ఘన్‌ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఇదివరకే ఐక్యరాజ్య సమితి (United nations) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ వెల్లడించారు. ఉగ్రవాదం (terrorism) పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల (human rights) పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ (world) దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్‌ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అప్ఘన్‌కు సత్వర ఆర్థిక సాయం (financial help) కోరుతూ ఐరాస జెనీవాలో విరాళాల (donations) సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్‌ కోరింది. అయితే తాజాగా అప్ఘనిస్తాన్లో మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రజలకు తినడానికి తిండి కూడా సరిగా దొరకట్లేదని తెలుస్తోంది.

యునిసెఫ్​ ప్రకటన..

అప్ఘనిస్తాన్ తాలిబాన్ల (talibans) ఆధీనంలోకి వెళ్లిన తర్వాత.. అక్కడ ప్రజల (people) జీవితం దుర్భరంగా మారిందని వార్తలు తరచుగా వింటున్నారు. తాజాగా అప్ఘనిస్తాన్ లోని సుమారు 10 లక్షల మంది చిన్నారుల ప్రాణాలు అర చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది చిన్నారులు (children) పోషకాహార లోపంతో ఇబ్బందులను ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్‌ (UNICEF) ఇటీవల వెల్లడించింది.

అప్ఘన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో భారీ విపత్తుగా మారనుందని.. నివారణ కోసం.. అంతర్జాతీయంగా అన్ని దేశాలు ముందుకు రావాలని.. పిల్లల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. లేదంటే అప్ఘనిస్తాన్ లో భవిష్యత్ తరాలను కోల్పోనున్నదని పిల్లల ప్రాణాలకు ముప్పు తప్పదని యునిసెఫ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒమర్‌ అబ్దీ హెచ్చరించారు.  ఇప్పటికే ఆయన దేశ వ్యాప్తంగా పర్యటించి కాబుల్‌లోని ఇందిరా గాంధీ చిన్నారుల ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

దేశంలో చాలా మంది తీవ్ర పోషకాహార లోపం సహా మిజిల్స్‌,  నీటి విరేచనాలు వంటి వ్యాధులతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని యునిసెఫ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నారు. అంతేకాదు తాలిబన్ నేతలతో భేటీ అయినా ఒమర్ చిన్నారులకు పోషకాహారం, మంచినీరు అందించాలని కోరారు.  ఇప్పటికే దేశంలో 30 శాతానికిపైగా ప్రజలు రోజూ ఒక పూట కూడా భోజనం (taking food) చేసే పరిస్థితి కూడా లేదని..  రోజు రోజుకీ ఆ దేశంలో ఆహార నిల్వలు కూడా తగ్గిపోతున్నాయని.. ఇక కొన్ని రోజుల్లోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందట.

ప్రపంచ దేశాలు అప్ఘనిస్తాన్ లోని చిన్నారులను కాపాడానికి ముందుకు రావాలని కోరారు. చిన్నారులను రక్షించుకోవడానికి పరిశుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని యునిసెఫ్​ సూచించింది.
Published by:Prabhakar Vaddi
First published: