హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan children: తల్లిదండ్రులు లేకుండానే దేశం దాటిన 300 మంది అప్ఘనిస్తాన్​ పిల్లలు.. యూనిసెఫ్​ ఆందోళన

Afghanistan children: తల్లిదండ్రులు లేకుండానే దేశం దాటిన 300 మంది అప్ఘనిస్తాన్​ పిల్లలు.. యూనిసెఫ్​ ఆందోళన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూనిసెఫ్ (UNICEF)​ ఓ సంచలన ప్రకటన (Announcement) చేసింది. అప్ఘనిస్తాన్​కు చెందిన పిల్లలు (children) ఇతర దేశాలకు వెళ్లినట్టు.. అయితే కనీసం వారితో ఒక్కరు కూడా లేరని. అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇతర దేశాలకు పిల్లలు వెళ్లినట్లు యూనిసెఫ్​ ప్రకటనలో పేర్కొనడం ఆందోళన కలిగించే అంశమే.

ఇంకా చదవండి ...

అప్ఘనిస్తాన్ (Afghanistan)​. గత కొద్దిరోజులుగా వణికిపోతోంది. తాలిబాన్లు దాడులు చేసి అప్ఘన్​ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్లకు భయపడి లక్షలాది మంది దేశం విడిచి ఇతర దేశాలకు (countries) వలసవెళ్లిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్లడానికి కాబూల్లో ఒకే విమానాశ్రయం ఉండటం.. అమెరికా సైన్యం అదుపులో ఎయిర్​పోర్టు (Airport) ఉండటంతో లక్షలాదిగా అక్కడికి చేరుకుని విమానాల్లో దేశం విడిచిపోయారు (leaving). అయితే చాలామంది స్థలం లేక ఉండిపోయారు. కొందరైతే విమానంపై కూర్చుని, రెక్కలు, చక్రాలపై నిలబడి వెళ్లినట్లు వీడియోల్లో చూశాం. అందులో చాలామంది మార్గమధ్యలోనే కిందపడి మృత్యువాత పడ్డారు. అయితే యూనిసెఫ్ (UNICEF)​ ఓ సంచలన ప్రకటన (Announcement) చేసింది. అప్ఘనిస్తాన్​కు చెందిన పిల్లలు (children) ఇతర దేశాలకు వెళ్లినట్టు.. అయితే కనీసం వారితో ఒక్కరు కూడా లేరని. అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇతర దేశాలకు పిల్లలు వెళ్లినట్లు యూనిసెఫ్​ ప్రకటనలో పేర్కొనడం ఆందోళన కలిగించే అంశమే.

అప్ఘాన్​లు తాలిబాన్ల (Talibans) కు భయపడ్డారు. కఠిన చట్టాలు అమలు చేయనున్నారని ముందే ఊహించారు. దీంతో కనీసం అప్పటివరకు చదువుకుంటున్న తమ పిల్లలనైనా రక్షించుకోవాలని(save) సంకల్సించారు. దీంతో వెంటనే తమ పిల్లలను దొరికిన విమానం (flight) ఎక్కించేశారు. కనీసం వారైనా బతుకుతారేమోనని ఆశ తల్లిదండ్రులది. అయితే ఆగస్టు 14 నుంచి దాదాపు 300 మంది చిన్నారులు (300 children) ఇతర దేశాలకు వెళ్లినట్లు యూనిసెఫ్ ప్రకటించింది.

వారంతా జర్మనీ (Germany), అమెరికా (America) తదితర దేశాలకు వెళ్లినట్లు పేర్కింది. వారి యోగ క్షేమాలు (take care them) చూడాల్సిందిగా ఆయా దేశాలను కోరింది. తమ సభ్యులు ఆయా దేశాల్లోని ఎయిర్​పోర్టులో పిల్లల వివరాలు సేకరిస్తున్నామని తెలిపింది యూనిసెఫ్​. తల్లిదండ్రులు, బంధువులు లేక పిల్లలు అవస్థలు పడుతూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది. బంధువులు దగ్గర ఉన్న పిల్లలను ఎవరూ దూరం పెట్టొద్దని యూనిసెఫ్​ అభ్యర్థించింది. వారు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారని సూచించింది.

కాగా, అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం కొలువుతీరనుంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన తాలిబన్లు.. ప్రభుత్వానికి ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్‌ (Mullah Muhammad Hassan Akhund) నేతృత్వం వహించనున్నట్టుగా వెల్లడించారు. దేశ ఉప ప్రధానిగా అబ్దుల్​ ఘనీ బరాదర్‌ను (Abdul Ghani Baradar) నియమిస్తున్నట్టుగా తాలిబన్లు ప్రకటించారు. అలాగే పలువురితో కూడిన మంత్రివర్గం ప్రకటించారు. ఇందులో అమెరికా, దాని మిత్ర దేశాల వారిపై పోరాటం చేసిన తాలిబన్ నాయకులకు పెద్ద పీట వేశారు. అయితే పదవీ విరమణ చేసిన ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తజికిస్తాన్‌కు పారిపోయినట్లు సూచించే నివేదికలతో పాటు పంజ్‌షీర్‌ని తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ పరిణామం చోటు చేసుకున్న తరువాత నాయకత్వానికి సంబంధించి తాలిబన్లు తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ (ఎన్‌ఆర్‌ఎఫ్) నాయకులలో ఒకరైన అహ్మద్ మసౌద్, పంజ్‌షీర్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: అప్ఘనిస్తాన్​లో గుప్త నిధుల కలకలం.. జ్వాజియన్‌ ప్రావిన్స్‌‌లో బయట పడ్డట్లు వార్తలు

First published:

Tags: Afghanistan, America, Children, Flight, Germany, Health care, International news, Travel

ఉత్తమ కథలు