Home /News /international /

ఓర్నీ.. ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారన్నమాట.. 70 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులపై కేసుపెట్టిన పుత్రరత్నం.. కారణమేంటంటే..

ఓర్నీ.. ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారన్నమాట.. 70 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులపై కేసుపెట్టిన పుత్రరత్నం.. కారణమేంటంటే..

తల్లిదండ్రులపై కోర్టుకు వెళ్లిన సిద్ధిఖీ (Image Credit: Twitter)

తల్లిదండ్రులపై కోర్టుకు వెళ్లిన సిద్ధిఖీ (Image Credit: Twitter)

మేము చనిపోయేంత వరకు కాస్తంత కూడు పెట్టించేలా చేయండి.. అంటూ వయసు మళ్లిన తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కిన సంఘటనల గురించి ఎన్నో విని ఉంటారు. చూసి ఉంటారు. కానీ ఓ కొడుకు మాత్రం..

  ‘నా కొడకు మమ్మల్ని చూడటం లేదు. జీవితాంతం కష్టపడి వాడిని చదివించి ప్రయోజకుడిని చేశాం. ఇప్పుడు వృద్ధాప్యంలో మమ్మల్ని నట్టేట వదిలేశాడు. మాకు న్యాయం చేయండి. మేము చనిపోయేంత వరకు కాస్తంత కూడు పెట్టించేలా చేయండి.’ అంటూ వయసు మళ్లిన తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కిన సంఘటనల గురించి ఎన్నో విని ఉంటారు. చూసి ఉంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఏదో ఒక మూల ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఉన్నత విద్యాభ్యాసం చేసి, లా గ్రాడ్యుయేట్ కూడా పొందిన ఓ వ్యక్తి తన తల్లిదండ్రులపై విచిత్రమైన కేసును ఒకటి పెట్టాడు. ‘వాళ్లు బతికి ఉన్నంత వరకయినా, లేక నేను బతికి ఉన్నంత వరకయినా నా సంరక్షణ బాధ్యత పూర్తిగా నా తల్లిదండ్రులతే. వాళ్లే నా ఖర్చులను భరించాలి‘ అంటూ కేసు పెట్టాడు. విచిత్రంగా ఉంది కదూ. మరి ఆ చిత్ర విచిత్ర కేసేంటో ఓ లుక్కేయండి.

  దుబాయికి చెందిన 71 ఏళ్ల జావెద్, 69 ఏళ్ల రక్షందా అనే వృద్ధ దంపతులకు 41 ఏళ్ల ఫయాజ్ సిద్ధిఖీ అనే కుమారుడు ఉన్నాడు. కొడుకు అంటే వల్లమాలిన ప్రేమతో అతడిని ఉన్నత చదువులు చదివించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదివించారు. మొత్తానికి ఆ యూనివర్శిటీ నుంచి లాయర్ డిగ్రీని కూడా పొందాడు. వాస్తవానికి జావెద్ దంపతులకు బాగానే ఆస్తి ఉంది. దీని మూలంగానే కొడుకును విదేశాలకు పంపించి మరీ చదివించగలిగారు. అయితే లాయర్ చదువు పూర్తి చేసిన సిద్ధిఖీ 2011వ సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. అంతకు ముందు కొన్ని న్యాయ సంస్థల్లో ఉద్యోగం చేసినా, ప్రవర్తన కారణంగా నిరుద్యోగి అయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగానికి కూడా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ కారణం వల్లే కొడుకు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు జావెద్ దంపతులు ముందుకొచ్చారు. ప్రస్తుతం లండన్లోనే ఉంటున్న సిద్ధిఖీ, కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ప్లాట్ లో ఉంటున్నారు. అది జావెద్ స్వార్జీతం.
  ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..

  అయినా సరే కొడుకును అందులో ఉచితంగానే ఉండనిస్తున్నారు. అంతే కాకుండా ఆ ఫ్లాట్ నిర్వహణ ఖర్చులతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం ప్రతీ నెలా దాదాపు లక్షన్నర రూపాయలకు పైగానే పంపుతూనే ఉన్నారు. అయితే కొడుకు చాలా కాలంగా ఉద్యోగానికి ప్రయత్నాలు చేయకపోవడం, ప్రయోజకుడు అవుతాడనుకుంటే ఖాళీగా ఉంటూ జల్సాలు చేస్తుండటంతో ఆ తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయమై కొడుకు సిద్ధిఖీతో గొడవపడ్డారు. ఆ తర్వాత అతడి అవసరాలకు గానూ పంపే మొత్తంలో కోతను విధించాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీంతో సిద్ధిఖీకి కోపం వచ్చింది. తన తల్లిదండ్రులపై గతేడాది లండన్ ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టాడు. దీన్ని ఆ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చడంతో, తాజాగా ఎగువ కోర్టుకు వెళ్లాడు. ‘నేను 20 ఏళ్లుగా లండన్ లో నా తండ్రి ఫ్లాట్ లో ఉచితంగా ఉంటున్నా. దీన్నే నా జీవితాంతం కొనసాగించాలి. అదే విధంగా ప్రతీ నెలా ఆర్థిక అవసరాలకు నాకు డబ్బు పంపించాలి. తల్లిదండ్రులుగా అది వాళ్ల బాధ్యత. కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను‘ అని సిద్ధిఖీ పేర్కొనడం గమనార్హం.

  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: America, Crime news, Dubai, International news, National

  తదుపరి వార్తలు