UN REVOKES TRAVEL PRIVILEGES FOR TWO TALIBAN EDUCATION OFFICIALS UMG GH
UN Travel Privileges: తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి షాక్.. విద్యాశాఖ ప్రతినిధుల ప్రయాణాలపై ఆంక్షలు
తాలిబన్ అధికారుల ప్రయాణాలపై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది.
తాలిబన్ (Taliban) ప్రతినిధులకు ఐక్యరాజ్య సమితి షాక్ ఇచ్చింది. ఆఫ్ఘన్ మహిళల (Afghan Women)పై విధించిన భారీ ఆంక్షలకు ప్రతిస్పందనగా ఐక్యరాజ్యసమితి సోమవారం ఇద్దరు తాలిబన్ అధికారుల ప్రయాణాలపై నిషేధం విధించింది. ఈ వివరాలను దౌత్యవేత్తలు AFPకి తెలిపారు.
తాలిబన్ ప్రతినిధులకు ఐక్యరాజ్య సమితి షాక్ ఇచ్చింది. ఆఫ్ఘన్ మహిళల(Afghan Women)పై విధించిన భారీ ఆంక్షలకు ప్రతిస్పందనగా ఐక్యరాజ్యసమితి సోమవారం ఇద్దరు తాలిబన్ అధికారుల ప్రయాణాలపై నిషేధం విధించింది. ఈ వివరాలను దౌత్యవేత్తలు AFPకి తెలిపారు. చర్చల కోసం 15 మంది తాలిబన్ అధికారులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన ప్రయాణ మినహాయింపులు సోమవారంతో ముగియనున్నాయి. వీరిలో 13 మంది అధికారులకు ప్రయాణ మినహాయింపులను కనీసం రెండు నెలల పాటు పొడిగించారు. అయితే తాలిబన్ బాలికలు, మహిళలకు పాఠశాలలకు ప్రవేశాన్ని రద్దు చేయడంతో ఇద్దరు తాలిబన్ విద్యాశాఖ అధికారులకు ఈ అనుమతులను రద్దు చేశారు.
2019లో మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఆదేశాల మేరకు, భద్రతా మండలి మొదట 41 మంది తాలిబన్ అధికారులపై విధించిన దీర్ఘకాల ప్రయాణ నిషేధాన్ని రద్దు చేసింది. శాంతి, స్థిరత్వ చర్చల కోసం 14 మంది నాయకులు ప్రయాణించడానికి అనుమతించింది. ఖతార్‌లోని దోహాలో యూఎస్, తాలిబన్ అధికారుల మధ్య చర్చల సందర్భంగా ఇది జరిగింది. అయితే ఆ తర్వాత ఒప్పందం ముగిసింది. ఈ ప్రక్రియలో యూఎస్ సిబ్బందిపై దాడి జరగదని హామీ ఇవ్వడానికి బదులుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అన్ని దళాలు, కాంట్రాక్టర్లను ఉపసంహరించుకోవడానికి వాషింగ్టన్ అంగీకరించింది.
వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఓ దౌత్యవేత్త తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పుడు ప్రయాణించకుండా నిషేధాలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులలో ఒకరు డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అహ్మద్ షైద్ఖేల్, మరొకరు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అబ్దుల్ బాకీ బసీర్ అవల్ షా.
ఆగస్టులో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి, తాలిబన్ గత రెండు దశాబ్దాలలో ఆఫ్ఘన్ మహిళలు సాధించిన హక్కులు, ప్రయోజనాలను వెనక్కి తీసుకుంది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్‌పై ఆంక్షలు విధించింది. తాలిబన్ చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. చర్చల తర్వాత తాలిబన్ ఆంక్షల కమిటీ అంగీకరించిన మేరకు 13 మంది తాలిబన్ నాయకులకు 60 రోజులు + 30 రోజులు అనుమతులు కల్పించడంపై యూఎన్ రాజీ పడిందని దౌత్యవేత్తలు AFPకి చెప్పారు.
మహిళల హక్కుల క్షీణత కారణంగా కొన్ని దేశాలు అన్ని ప్రయాణ మినహాయింపులను రద్దు చేయడానికి అనుకూలంగా ఉన్నాయని, అయితే ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారని దౌత్యవేత్తలు తెలిపారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, 13 మంది తాలిబన్ నాయకులకు మూడో నెలలో ఏదైనా కౌన్సిల్ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేయకపోతే మినహాయింపు ఆటోమేటిక్‌గా ఎక్స్టెండ్ అవుతుందని తెలిపారు. మరోవైపు తాలిబన్లు మాత్రం తమ పాలనా వ్యవహారాలను కఠినంగా అమలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా సంప్రదాయ వాదులను శాంతి పర్చేలా వారి పాలన కొనసాగుతోంది. తాజా ఆంక్షలు వారి పరిపాలనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.