హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UN Report: అప్ఘానిస్తాన్ లో జైషే,లష్కర్ శిక్షణ శిబిరాలు

UN Report: అప్ఘానిస్తాన్ లో జైషే,లష్కర్ శిక్షణ శిబిరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 JeM and LeT maintain training camps in Afghanistan: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జైష్-ఎ-మహ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి పాకిస్తాన్(Pakistan)ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘానిస్తాన్‌(Afghanistan)లోని కొన్ని ప్రావిన్సులలో తమ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

JeM and LeT maintain training camps in Afghanistan: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జైష్-ఎ-మహ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి పాకిస్తాన్(Pakistan)ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘానిస్తాన్‌(Afghanistan)లోని కొన్ని ప్రావిన్సులలో తమ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిక్షణ శిబిరాల్లో కొన్ని నేరుగా తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయని తాజాగా విడుదలైన యూఎన్ రిపోర్ట్ తెలిపింది. . ఐరాస భద్రతా మండలి తాలిబన్ ఆంక్షల కమిటీకి చెందిన మోనిటరింగ్ టీమ్ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఐరాస విడుదల చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. సభ్య-దేశాలతో సంప్రదింపుల ఆధారంగా తీర్మానాలు రూపొందించారు. తాలిబన్ ఆంక్షల కమిటీకి ప్రస్తుతం ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అధ్యక్షత వహిస్తున్నారు, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ సహా పలు ఉగ్రవాద సంస్థల నుంచి తాలిబన్లకు నిధులు అందుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక బహిర్గతం చేసింది.

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)... తాలిబాన్ కార్యకలాపాలకు ఆర్థిక మరియు శిక్షణా నైపుణ్యాన్ని అందించినట్లు మునుపటి మానిటరింగ్ టీమ్ నివేదికలలో వివరించబడింది. జైష్-ఎ-మొహమ్మద్ (JeM),సైద్ధాంతికంగా తాలిబాన్‌కు దగ్గరగా ఉన్న దేవ్‌బందీ గ్రూపు ఎనిమిది శిక్షణా శిబిరాలను నంగర్‌హార్‌లో నిర్వహిస్తోంది, వాటిలో మూడు నేరుగా తాలిబాన్ ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపింది. మసూద్ అజార్ నేతృత్వంలోని దేవ్‌బందీ గ్రూపు జైషే మహ్మద్ సైద్ధాంతికంగా తాలిబాన్‌తో సన్నిహితంగా ఉందని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో జైషే మొహమ్మద్ కు కొత్తగా ఖరీ రంజాన్ నియమితులయ్యారు.  కాగా, దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ చీఫ్ సుహైల్ షాహీన్ గత వారం మాట్లాడుతూ.. ఏ దేశానికి వ్యతిరేకంగా ఆఫ్గన్ భూభాగాన్ని ఉపయోగించడానికి ఎవరినీ అప్ఘాన్ ప్రభుత్వం అనుమతించడం లేదని చెప్పారు.

ALSO READ  Terrorist killed:కశ్మీర్ లో ఎన్ కౌంటర్..జైషే ఉగ్రవాది హతం

అయితే, అఫ్ఘాన్ భూభాగంలో పాక్ ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలు, తాలిబన్లతో సంబంధాలపై భారత్ ఆందోళన చెందుతోంది. అఫ్ఘానిస్తాలో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ కార్యకలాపాలు పున ప్రారంభం, అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాదుల ఉనికిని ఐరాస తాజా నివేదిక బట్టబయలు చేసింది. తాలిబన్లకు లష్కరే తొయిబా ఆర్థిక సహాయం, శిక్షణ ఎలా అందించిందో మునుపటి నివేదికలో హైలైట్ చేసింది. నంగర్‌హర్‌లోని హస్కా మినా జిల్లాలోని లష్కరే తొయిబా శిక్షణా శిబిరాన్ని ఈ ఏడాది జనవరిలో తాలిబన్ ప్రతినిధి బృందం సందర్శించిందని పేర్కొంది. అలాగే, గతేడాది అక్టోబరులో తాలిబాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ నూర్ జలీల్‌ను లష్కరే నేత మవ్లావి అసదుల్లా కలిశారని స్పష్టం చేసింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Afghanistan, Taliban, United Nations

ఉత్తమ కథలు