హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Turkey name change:పేరు మార్చుకున్న టర్కీ..ఇకపై ఏమని పిలవాలంటే..

Turkey name change:పేరు మార్చుకున్న టర్కీ..ఇకపై ఏమని పిలవాలంటే..

టర్కీ అధ్యక్షుడు

టర్కీ అధ్యక్షుడు

Turkey name change: . దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్ తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా తమ పేరును నార్త్ మాసిడోనియాగా మార్చుకుంది. గ్రీస్‌తో వివాదం నడుమ మాసిడోనియా ఈ చర్యలు తీసుకుంది.

ఇంకా చదవండి ...

Turkey official name Türkiye: తమ దేశం పేరుపై టర్కీ కీలక నిర్ణయం తీసుకుంది. క నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐరాసకు టర్కీ విదేశాంగ మంత్రి ప్రతిపాదన పంపారు. టర్కీ గుర్తింపులో మార్పులుచేసే "రీబ్రాండింగ్" కార్యక్రమాన్ని గత ఏడాది దేశ అధ్యక్షుడు రెచప్ తయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా తమ దేశం పేరును మార్చాలని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియా (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని గత ఏడాది డిసెంబరులో ఎర్దోవాన్ చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును టుర్కీయే(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు.నూతన నామాన్ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. గత వారం టర్కీ నుంచి అభ్యర్థన వచ్చిన వెంటనే పేరు మర్చినట్లు ఐక్యరాజ్యసమతి వెల్లడించింది. దీంతో టర్కీ దేశం పేరు ఇక చరిత్ర కానుంది.

గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్‌టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ అనే పేరు ఒక పక్షికి ఉండటంతోపాటు "దారుణంగా విఫలమైనది లేదా మతిలేని వ్యక్తి"అనే అర్థాలు దీనికి ఇంగ్లీష్ లో ఉన్నాయి. దీంతో పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్‌టీ తెలిపింది. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా టర్కీ నుంచి ఎగుమతయ్యే ప్రాడక్టులపై "మేడ్ ఇన్ తుర్కియా"అని మారుస్తారు. గత జనవరిలో "హెలో తుర్కియా" పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని టర్కిష్​ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ALSO READ China Population Drop: చైనాలో భారీగా తగ్గిన జనాభా..నాలుగు దశాబ్దాలలో తొలిసారి!

అయితే, ఈ పేరు మార్పుకు ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు దీనికి మద్దతు పలుకుతుంటే, వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్ తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా తమ పేరును నార్త్ మాసిడోనియాగా మార్చుకుంది. గ్రీస్‌తో వివాదం నడుమ మాసిడోనియా ఈ చర్యలు తీసుకుంది. ఇంకా చాలా దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయి.

First published:

Tags: Turkey, United Nations

ఉత్తమ కథలు