Home /News /international /

UKRANIAN ANTONOV AN 12 CARGO PLANE CARRYING DANGEROUS EXPLOSIVE MATERIALS CRASHES IN NORTHERN GREECE SK

Plane Blast: బాంబులను తీసుకెళ్తూ గాల్లోనే పేలిపోయిన ఉక్రెయిన్ విమానం.. వీడియోలు వైరల్

ఘటనా స్థలంలో ఎగిసిపడుతున్న మంటలు

ఘటనా స్థలంలో ఎగిసిపడుతున్న మంటలు

Ukranian Plane Crash in Greece: భారీ మొత్తంలో యుద్ధ సామాగ్రిని తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అందులో 12 టన్నుల మేర బాంబులు, ఇతర ఆయుధాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • International
    గ్రీస్‌లో ఘోర విమాన (Plane Crash in Greece) ప్రమాదం జరిగింది. కవాలా నగరానికి సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన భారీ కార్గో విమానం (Ukranian cargo plane crash) కుప్పకూలింది. భారీ ఎత్తున మంటలు, పొగలు రావడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన విమానాన్ని ఆంటోనోవ్-ఏఎన్ 12-బీకేగా గ్రీస్ అధికారులు గుర్తించారు. దీనిని ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కంపెనీ నిర్వహిస్తుంది. సెర్బియా నుంచి జోర్డాన్‌కు వెళ్తుండగా.. ఉత్తర గ్రీస్‌లో కూలిపోయింది. పెద్ద పెద్ద శబ్ధాలతో విమానం గాల్లోనే పేలిపోయింది. ఆకాశం నుంచి మండుతున్న వస్తువులు కిందికి పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్గో విమానంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. భారీ మొత్తంలో యుద్ధ సామాగ్రిని తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అందులో 12 టన్నుల మేర బాంబులు, ఇతర ఆయుధాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.






    ఆంటోనోవ్-12 యుద్ధ విమానంలో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని.. అందులో కొన్ని ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ERT తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, మీడియా ప్రతినిధులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. విమానంలో ఉన్న వారంతా మరణించి ఉండవచ్చని.. వారీ మృతదేహాలు కూడా లభ్యం కాలేదని తెలిపారు. పేలుడు ధాటికి ముక్కలు కావచ్చని అభిప్రాయపడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న జర్నలిస్టులు, స్థానికులు మాస్క్‌లు ధరించాలని పోలీసులు సూచించారు. విమానంలో మందుగుండు సామాగ్రి ఉందని.. మీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.





    విమానం సెర్బియా నుంచి జోర్డాన్‌కు వెళ్తుండగా.. విమానం ఇంజన్‌ ఫెయిల్‌ అయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. ఏవియేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానాన్ని థెస్సలోనికి లేదా కవాలా విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని.. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కవాలాలో విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్లు నిర్ణయించుకున్నారని.. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ప్రమాదం జరిగిదని గ్రీస్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. కావాలా విమానాశ్రయానికి పశ్చిమాన 40 కి.మీ దూరంలో విమానం కూలిపోయిందని వెల్లడించింది. విమానం కూలిపోయిన తర్వాత కూడా.. కొన్ని నిమిషాల పాటు పేలుళ్ల శబ్ధాలు విన్నామని పాజియో మేయర్ ఫిలిప్పోస్ అనస్టాస్సియాడిస్ తెలిపారు. జనవాసా ప్రాంతాకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే విమానం కూలిందని.. ఇళ్ల మధ్య కూలి ఉంటే.. భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగేదని పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International, International news, Plane Crash, Ukraine

    తదుపరి వార్తలు