హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Ukraine-Russia: రష్యాకు టార్గెట్స్‌గా మారిన ఉక్రెయిన్‌ రైలు మార్గాలు.. ఎందుకు ఇవి కీలకంగా మారాయి..?

Ukraine-Russia: రష్యాకు టార్గెట్స్‌గా మారిన ఉక్రెయిన్‌ రైలు మార్గాలు.. ఎందుకు ఇవి కీలకంగా మారాయి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్ 25న సెంట్రల్(Central), పశ్చిమ ఉక్రెయిన్‌లోని(Ukraine) ఐదు రైల్వే స్టేషన్లపై(Railway Stations) రష్యా(Russia) దళాలు బాంబు దాడి చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఏప్రిల్ 25న సెంట్రల్(Central), పశ్చిమ ఉక్రెయిన్‌లోని(Ukraine) ఐదు రైల్వే స్టేషన్లపై(Railway Stations) రష్యా(Russia) దళాలు బాంబు దాడి చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఉక్రెయిన్ రైల్వే నెట్‌వర్క్‌ను(Ukraine Railway Network) నిర్వీర్యం చేసే లక్ష్యంతో రష్యా జరిపిన దాడుల్లో కనీసం 5 మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని సమాచారం. NATO సభ్యత్వం ఉన్న పోలాండ్‌కు 70 మైళ్ల దూరంలో ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న క్రాస్నేలో విద్యుత్ సబ్‌స్టేషన్ ధ్వంసం అయింది. రష్యా రైల్వే మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో నాశనం చేయాలని చూస్తోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా దళాలకు ఉక్రెయిన్‌లోని స్టేషన్‌లు, రైల్వే మౌలిక సదుపాయాలు కీలకంగా మారాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ రైల్వే వ్యవస్థ ధ్వంసం బహుమతిలా రష్యన్ దళాలు భావిస్తున్నాయి.

Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..

ఉక్రెయిన్ రైల్వే లైన్‌లు ఎందుకు కీలకం అంటే..

ఉక్రెయిన్ రైలు మార్గాలు కష్టతరమైన ప్రాంతాలకు సహాయాన్ని అందించడంలో, దేశవ్యాప్తంగా దళాలు, సామగ్రిని తరలించడంలో కీలకంగా ఉన్నాయి. రైళ్ల ద్వారా లక్షలాది మంది శరణార్థులను తరలించి, నియంత్రణ సాధించకుండా రష్యాను ఉక్రెయిన్‌ అడ్డుకొంది. మార్చి ప్రారంభంలో ప్రతిరోజూ ఉచిత రైళ్లలో పశ్చిమం వైపు 190,000 మంది ఉక్రెయిన్‌ ప్రజలు ప్రయాణించారు. ఈ రైళ్లను యూకే పీఎం బోరిస్ జాన్సన్, ఇతర ఉన్నత దౌత్యవేత్తలు, విదేశీ ప్రముఖులు ఉపయోగించారు. పోలిష్, చెక్, బాల్టిక్ నాయకులు రైలులో కీవ్‌కు ప్రయాణించాలని తీసుకొన్న నిర్ణయం నెట్‌వర్క్ భద్రతపై వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

ఉక్రెయిన్‌ రైలు మార్గాలు యుద్ధ సమయంలో ఎలా ఉపయోగపడుతున్నాయి..

మార్చి 17న ఆక్రమణ దళాలకు వ్యతిరేకంగా "టోటల్‌ రైల్‌ వార్‌"కు ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఒలెక్సీ అరెస్టోవిచ్ పిలుపునిచ్చారు. ఏకకాలంలో ముందు వైపు సరఫరా లైన్లను తెరిచి, రష్యన్ దళాలు వినియోగిస్తున్న వాటికి కీవ్‌ అంతరాయం కలిగించింది. బెలారస్‌లోని రైలు కార్మికులు సరిహద్దు వైపు రైలు మార్గాలను ధ్వంసం చేయడం ద్వారా ఉక్రెయిన్‌కు సహాయం చేశారని ఉక్రెయిన్ రైల్వే చీఫ్ ఒలెక్సాండర్ కమిషిన్ తెలిపింది. ఉక్రెయిన్‌కు రష్యన్ దళాలు, సైనిక పరికరాల ప్రవాహాన్ని అడ్డుకోవడంలో బెలారస్‌ మద్దతుదారులు సహాయపడ్డారు.

Elon Musk | Twitter : ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్.. 44బిలియన్ డాలర్ల డీల్ ఒకే.. అధికారిక ప్రకటన జారీ


సలహాదారు చేసిన ట్వీట్‌ తరువాత బెలారసియన్ ప్రతిఘటన పునరావృతమైంది. తరలింపులకు సహాయం చేసే ప్రయత్నంలో పోలాండ్‌లోకి ప్రవేశించేందుకు 19వ శతాబ్దపునాటి మార్గాలను పునరుద్ధరించడానికి పోలిష్ వాలంటీర్లు ప్రయత్నించారు. మార్చి 29న షెల్డ్ నగరంలో, ఖార్కివ్‌లో సబర్బన్ రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల క్రామాటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై రష్యా మిసైల్‌ దాడితో 50 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటివరకు కనీసం 40 మంది రైలు సిబ్బంది మరణించారని, 41 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

రష్యాకు రైల్వే లైన్‌లు ఎందుకు కీలకం?

లాజిస్టికల్ సమస్యలు, రైలు రవాణాకు అవకాశం లేకపోవడంతో ఉక్రెయిన్‌లో పుతిన్ ప్రణాళికలు పనిచేయలేదు. సోవియట్‌ యూనియన్‌ తరహాలో దాదాపు ప్రతిదీ రైలు ద్వారా తరలించడంపై రష్యా ఆధారపడుతోంది. తమ దళాలను, సైనిక పరికరాలను తరలించడానికి రైల్వేలపై రష్యా ఎక్కువగా ఆధారపడుతుంది. ఉక్రెయిన్‌లో రైలు మార్గాల ద్వారా కాకుండా రోడ్డు మార్గంలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యా సైన్యానికి రహదారిని ఉపయోగించడానికి ట్రక్కుల కొరత ఉండగా..ప్రధానంగా ఈ వాహనాలు వారికి అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా రైల్‌రోడ్‌పై ఉక్రెయిన్ ఆధారపడుతోంది. అందువల్ల రైల్ నెట్‌వర్క్‌ వినియోగించుకొని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకొనేందుకు రష్యా యత్నిస్తోంది. డిపోల నుంచి 140 కి.మీ. దాటి యూనిట్లను సమర్ధవంతంగా తిరిగి సరఫరా చేయడానికి రష్యా మిలిటరీ వద్ద తగినన్ని ట్రక్కులు లేవని రిపోర్ట్స్‌ తెలుపుతున్నాయి. రాకెట్ లాంచర్‌లను రీలోడ్ చేయడానికి ఒక వాలీకి 90 ట్రక్కులు రష్యాకు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను సులువుగా తరలించేందుకు రష్యాకు ఉక్రెయిన్ రైలు మార్గాలు అవసరంగా మారాయి.

Murder Case : అర్థరాత్రి ఆగలేక భార్యతో వాట్సాప్ చాట్..అసలు ట్విస్ట్ ఇక్కడే..డామిట్ కథ అడ్డం తిరిగింది

ఉక్రెయిన్‌లో బ్లింకెన్‌ రైలును ఉపయోగించిన తర్వాత దాడులు..

అగ్రశ్రేణి యూఎస్‌ దౌత్యవేత్తలు కీవ్‌కు రైలులో ప్రయాణించిన కొద్దిసేపటికే ఎల్వివ్, రివ్నే, విన్నిస్టా, కీవ్‌ ప్రాంతాలలో రైల్వే మార్గాలపై రష్యా దాడులు చేశాయి. కీవ్‌లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలవడానికి రైలులో యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రయాణించారు. ఇద్దరు యుఎస్ దౌత్యవేత్తలు ఉక్రెయిన్‌కు 700 మిలియన్ డాలర్ల అదనపు సైనిక సహాయానికి హామీ ఇచ్చారు. పోలిష్ సరిహద్దుకు సమీపంలో మిసైల్‌ దాడులు పశ్చిమ దేశాలకు హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌లోకి వెళ్లే ప్రధాన మార్గం క్రాస్నేపై దాడి, దేశంలోకి ఆయుధాల తరలింపునకు ఇదే ప్రధాన కేంద్రం.

ఉక్రెయిన్‌కు నాటో సరఫరా మార్గాలపై పుతిన్ దాడులు జరుపుతాడా..?

ఉక్రెయిన్‌కు ఆయుధ రవాణాను ఆపడానికి పుతిన్ NATO భూభాగంపై దాడులు జరుపుతాడని నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెషిన్ గన్లు, వ్యూహాత్మక డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిసైల్స్‌ సహా పాశ్చాత్య ఆయుధాలు పోలాండ్, రొమేనియా గుండా ఉక్రెయిన్‌లోకి ప్రవేశం. తూర్పు పోలాండ్ లేదా ఉత్తర రొమేనియాలోని సరఫరా కేంద్రాలపై రష్యా దాడులు NATO కలెక్టివ్‌ డిఫెన్సివ్‌ ప్రొవిజన్‌ ఆర్టికల్‌ 5ను యాక్టివేట్‌ చేసే అవకాశం ఉంది. చారిత్రాత్మకంగా తమ శత్రువులకు సహాయం చేసే దేశాలపై దాడి చేయడాన్ని మాస్కో, వాషింగ్టన్ నివారించాయి. వియత్నాం యుద్ధం సమయంలో వియత్ కాంగ్ సరఫరా లైన్లు, అభయారణ్యాలను ధ్వంసం చేయడానికి యూఎస్‌ చేసిన ప్రయత్నాలు రాజకీయంగా ఖరీదైనవిగా, వ్యూహాత్మకంగా అసమర్థమైనవిగా నిరూపితం అయ్యాయి.


1980లలో ముజాహిదీన్ అని పిలిచే ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారుల తీవ్ర ప్రతిఘటన మధ్య ఆఫ్ఘనిస్తాన్‌పై మాస్కో దాడి చేసింది. పశ్చిమ పాకిస్థాన్‌లో ఉన్న ముజాహిదీన్ యోధులకు 2 బిలియన్లకు పైగా పరికరాలు, శిక్షణ, ఆయుధాలను CIA అందించారు. యూఎస్‌ ఊహించినట్లుగా యుద్ధం విస్తరించడం మాస్కోకు ఇష్టం లేనందున.. పాకిస్థాన్‌పై సరిహద్దు దాడులను రష్యా ప్రారంభించలేదు. పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి అవసరమైన దళాలను కలిగి ఉండకపోవచ్చని, రెండోళదేశం సరిహద్దులోకి ప్రవేశించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు