హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War : పుతిన్ తో మాట్లాడిన తర్వాత..రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు!

Russia-Ukraine War : పుతిన్ తో మాట్లాడిన తర్వాత..రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు!

Russia-Ukraine War : ఉక్రెయిన్ పై దాడి నల్లేరుపై నడకేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తప్పుడు సమాచారం అందించాడని, అందుకు విరుద్ధంగా ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండడంతో షోయిగుపై పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కనిపించకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఇంకా చదవండి ...

Russia Defence Minister Gets Heart Attack : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్‌ అస్తవ్యస్తమైంది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను ఫిబ్రవరి 24న రష్యా మొదలుపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తున్నప్పటికీ.. ఇంకా ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేదు. ఉక్రెయిన్​ పై అత్యాధునిక క్షిపణులు, బాంబులతో రష్యన్​ సేనలు విరుచుకుపడుతున్నాయి. గత నెల రోజుల పాటు క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా సేనల్ని ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌ పౌరులతో పాటు సైనికులు రష్యాను ప్రతిఘటించి శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నాయి.

కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు వచ్చిందని తాజాగా ఉక్రెయిన్‌ మంత్రి అంటోన్ గెరాష్చెంకో ఆరోపించారు. ఉక్రెయిన్‌పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యలో వైఫల్యంపై పుతిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని..ఈ వైఫల్యానికి ఆయనే కారణమంటూ పుతిన్‌ మండిపడటంతో యుద్ధానికి సూత్రధారి అయిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు వచ్చిందని ఉక్రెయిన్ మంత్రి అంటోన్‌ తన షేస్‌బుక్‌ పోస్ట్‌ లో పేర్కొన్నారు. అందుకే ఆయన మార్చి 11 నుంచి బహిరంగంగా కనిపించలేదన్నారు.

ALSO READ Earth Hour 2022: ఈ చీకటి.. రాబోయే తరాల వెలుగు కోసం.. భారత్‌లో ఘనంగా ఎర్త్ అవర్.. ఏంటిది?

ఉక్రెయిన్ పై దాడి నల్లేరుపై నడకేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తప్పుడు సమాచారం అందించాడని, అందుకు విరుద్ధంగా ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండడంతో షోయిగుపై పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కనిపించకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో వైఫల్యం, కీలక నగరాలైన ఖర్కీవ్‌, కీవ్‌ ను రష్యా సైన్యం స్వాధీనం చేసుకోలేకపోవడంపై పుతిన్‌ ఆయనను శిక్షించినట్లు వదంతులు వచ్చాయి. దీంతో రష్యా ప్రతినిధి దీనిపై స్పందించారు. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ వల్ల రక్షణ మంత్రి బిజీగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మార్చి 24న రష్యా రక్షణ మంత్రి టీవీలో కనిపించారు. ఉక్రెయిన్‌ యుద్ధంపై అధ్యక్షుడు పుతిన్‌, జాతీయ భద్రతా మండలికి ఆయన టీవీ కాన్ఫరెన్స్‌ ద్వారా వివరిస్తున్నట్లుగా అందులో ఉంది. అయితే ఆయన ఎలాంటి ప్రసంగం చేయలేదు. దీంతో ఇది పాత వీడియోనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షోయిగు తాజాగా సైనిక, ఆర్థికశాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారంటూ.. సమావేశం ఫొటోలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరిగిందన్న దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇక,యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పుతిన్‌ తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

ఉత్తమ కథలు