Home /News /international /

UKRAINIAN KIDS KILLED IN RUSSIAN ATTACKS PVN

Russia దాడిలో 6ఏళ్ల చిన్నారి మృతి..ఈ చిన్నారి మృతదేహాన్ని పుతిన్ కు చూపించు దేవుడా!

రష్యా దాడిలో మరణించిన 6ఏళ్ల ఉక్రెయిన్ చిన్నారి

రష్యా దాడిలో మరణించిన 6ఏళ్ల ఉక్రెయిన్ చిన్నారి

Ukranian Kids Killed In Russia Attacks : ఉక్రెయిన్​- రష్యా మధ్య తొలి దఫా చర్చలు సోమవారం బెలారస్​ సరిహద్దుల్లో సుమారు 4 గంటల పాటు సాగాయి. ఇరు దేశాలు తమ డిమాండ్లను వినిపించాయి. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు.

6 Years Kid killed In  Russia Attacks : ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ వీధుల్లో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాల్పులు, బాంబుల ప్రయోగాలతో చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రష్యా దళాలను ఉక్రెయిన్​ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌ పై రష్యా దాడిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా బలగాలు జరుపుతున్న కాల్పుల్లో చిన్నారులు, వృద్ధులు మరణిస్తున్నారు. ఓఖ్టిర్కాలో షెల్లింగ్ అనే నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడేళ్ల పాప కూడా ఉంది. షెల్లింగ్ నగరం కివీ నుంచి 345 కిలో మీటర్ల దూరంలో ఉంది. మరోవైపు,ఉక్రెయిన్‌లోని ఓడ రేవు నగరమైన మారియు పోల్‌ లో రష్యన్ బలగాల దాడిలో ఆరేళ్ల చిన్నారి తీవ్ర గాయాలకు గురై మరణించడం అందరి హృదయాలను ద్రవింప జేస్తోంది.

ఎప్పటిలాగే తన ఇంట్లో ఆడుకుంటున్న ఆ చిన్నారి రష్య బలగాల దాడిలో తీవ్రంగా గాయపడింది. బాలిక తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డారు. తమ గారాలపట్టి తీవ్ర గాయాలతో అచేతన స్థితిలో పడిఉండడం చూసి ఆ తల్లి భోరున ఏడ్చేసింది. తమ చిన్నారిని కాపాడాలంటూ వేడుకుంది. గాయపడిన తండ్రి,6ఏళ్ల కూతురిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. చిన్నారిని రక్షించేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించ లేదు. ఆ చిన్నారి కన్నుమూసింది.. ఆ చిన్నారి మరణంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. హాస్పిటల్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ముద్దులొలికే చిన్నారి విగతజీవిగా పడి ఉండడం చూసి చలించి పోయారు. ఆ కోపంతో అక్కడే ఉన్న ఓ వైద్యుడు ఈ చిన్నారి మృతదేహాన్ని పుతిన్‌ కు చూపించు దేవుడా అని వాపోయాడు. మరోవైపు దాడిలో గాయపడ్డ ఆ చిన్నారి తండ్రి కూడా చావుబతుకుల మధ్య ఉన్నారు.

ALSO READ Russia-Ukraine War : కుదేలైన రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ..ఏటీఎంల వద్ద రష్యన్ల క్యూ

రష్యా సేనలను ప్రతిఘటిస్తూ వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు నాటో సభ్య దేశాలు ముందుకొస్తున్నాయి. గగనతల రక్షణ క్షిపణులు, ట్యాంకు విధ్వంసక ఆయుధాలను అందించాలని సభ్య దేశాలు నిర్ణయించాయని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ తెలిపారు. ఆర్థిక, మానవతా సహాయాన్ని సైతం అందించనున్నట్లు చెప్పారు.

ఇక,,ఉక్రెయిన్​పై దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలతో బెలారస్ సైన్యం చేరే అవకాశముందని అమెరికా నిఘా అధికారులు వెల్లడించారు. ఈ రెండు దేశాలు కలిసి ఉక్రెయిన్ పై యుద్ధాన్ని తీవ్రతరం చేయవచ్చని పేర్కొన్నారు. యుద్ధంలో రష్యాకు బెలారస్ మద్దతుగా ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సహకారం అందించలేదు. అయితే రష్యా, ఉక్రెయిన్ చర్చల ఫలితాలను బట్టి బెలారస్​ నిర్ణయం ఉంటుందని, మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అమెరికా అధికారులు వివరించారు.

ALSO READ Australia:బ్రిస్బేన్‌లో భారీ వర్షాలు, వరదలు..వేలది ఇళ్లు నాశనం

మరోవైపు, ఉక్రెయిన్​- రష్యా మధ్య తొలి దఫా చర్చలు సోమవారం బెలారస్​ సరిహద్దుల్లో సుమారు 4 గంటల పాటు సాగాయి. ఇరు దేశాలు తమ డిమాండ్లను వినిపించాయి. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. ఈ క్రమంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమైనట్లు సమాచారం. పోలిష్​-బెలారస్​ సరిహద్దు ప్రాంతంలో రెండో దశ చర్చలు జరగనున్నాయని రష్యా ప్రతినిధుల బృందం అధినేత తెలిపినట్లు మీడియా పేర్కొంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Children, Kills, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin

తదుపరి వార్తలు