Home /News /international /

UKRAINIAN BOEING PLANE SHOT DOWN DUE TO HUMAN ERROR SAYS IRAN SB

ఉక్రెయిన్ విమానం కూల్చేసింది తామే అన్న ఇరాన్

ఇరాన్ క్షిపణి దాడులు

ఇరాన్ క్షిపణి దాడులు

పొరపాటున జరిగిన ఈ ప్రమాదం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాపై ఆగ్రహంతో ఇరాన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లే అనేకమంది ప్రాణాలు పోగట్టుకున్నారు.

    ఇరాన్‌లో ఇటీవలే ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో అందరూ అనుకున్న అనుమానాలే నిజమయ్యాయి. విమానం కుప్పకూలి 176 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. ఇరాన్ విమానాన్ని కూల్చేసింది తామేనని ప్రకటించింది. విమానాన్ని క్షిపణితో కూల్చేశామని పేర్కొంది. ఆర్మీ సైట్‌కు దగ్గరగా రావడంతో తామే పొరపాటున కూల్చేశామని తెలిపింది. అయితే ఈ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో 63మంది కెనడా పౌరులు ఉన్నారు. దీంతో ఇరాన్ పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున జరిగిన ఈ ప్రమాదం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాపై ఆగ్రహంతో ఇరాన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లే అనేకమంది ప్రాణాలు పోగట్టుకున్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం ఎదుట ఇరాన్ దోషిగా నిలబడింది.

    జనవరి 8న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో ఉన్న 178 మంది ప్రయాణికులు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Iran, Iran US Tension

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు