హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Crude Oil: భారత్‌కు భారీగా రష్యా క్రూడ్ ఆయిల్.. భగ్గుమన్న అమెరికా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి సమర్థనా?

Crude Oil: భారత్‌కు భారీగా రష్యా క్రూడ్ ఆయిల్.. భగ్గుమన్న అమెరికా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి సమర్థనా?

భారత్-రష్యా ఆయిల్ ఒప్పందంపై అమెరికా స్పందన

భారత్-రష్యా ఆయిల్ ఒప్పందంపై అమెరికా స్పందన

యుద్ధ పరిస్థితులు, తీవ్రమైన ఆంక్షల నడుమ రష్యా తక్కువ ధరకే ఇండియాకు ఆయిల్ సరఫరా చేయనుంది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా భగ్గుమంది. చరిత్రను ప్రస్తావిస్తూ తీవ్ర ఆక్షేపణలు చేసింది.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై నాలుగు వారాలు కావొస్తున్నది. రాజధాని కీవ్ సహా పలు నగరాలు నిలువునా ధ్వంసం అవుతున్నా లొంగుబాటుకు ఉక్రెయిన్ నో చెబుతున్నది. అంతర్జాతీయంగా కఠినమైన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే స్థితిలోనూ రష్యా యుద్ధాన్ని ఆపబోనంటున్నది. దాదాపు దారులన్నీ మూసుకుపోయిన రష్యాకు భారత్ తో క్రూడ్ ఆయిల్ డీల్ ద్వారా భారీ ఉద్దీపనం లభించినట్లయింది. యుద్ధ పరిస్థితులు, తీవ్రమైన ఆంక్షల నడుమ రష్యా తక్కువ ధరకే ఇండియాకు ఆయిల్ సరఫరా చేయనుంది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా భగ్గుమంది. ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా చర్యలకు జడిసినా చరిత్రను ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆక్షేపణలు చేసింది. పూర్తి వివరాలివే..

ముడి చమురు, సహజ వాయువు, వంట నూనెల ఎగుమతుల్లో అగ్రభాగన ఉండే రష్యా, ఉక్రెయిన్ దేశాలు నాలుగు వారాలుగా యుద్దంలో మునిగిపోయిన దరిమిలా అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనవుతూ, దాదాపు అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెలు, బొగ్గు, సిమెంట్ తదితర ధరలు భారీగా పెరిగాయి. గత నెలరోజుల్లోనే అమెరికా, యూరప్ దేశాల్లో పెట్రో ధరలు 50శాతానికిపైగా పెరిగాయి. పాకిస్తాన్ లోనైతే డీజిల్ నిల్వలు దాదాపు అడుగంటాయి. భారత్ లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి. అయితే, మోదీ సర్కార్ ఇక్కడ భిన్నమైన ఎత్తుగడను అనుసరిస్తోంది. ఆయిల్ బాండ్ల‌ను జారీని పూర్తిగా నిలిపేసి, ఇంధ‌న ధ‌ర‌ల‌ను స్థిరీక‌రించేంచేలాందుకు యత్నిస్తోంది. అదే సమయంలో గల్ఫ్, దక్షిణ అమెరికా నుంచి లభించే సరఫరాపైనా దృష్టి సారించింది. కానీ ఈలోపే భారత్ కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది.

Vastu Tips: ఇవి పాటిస్తే మీ ఇంట్లో ధన ప్రవాహమే.. ఆరోగ్యం, ఆనందాన్ని ఇచ్చే వాస్తు నియమాలు..

రష్యా నుంచి రాయితీతో కూడిన ముడి చమురును భారత్ కొనుగులో చేస్తుండటంపై అమెరికా మండిపడింది. భారత్ చర్యలు ఆంక్షల ఉల్లంఘన కాదంటూనే.. ఇండియా తప్పుడు శక్తులకు సహకరించిందని చరిత్ర గుర్తిస్తుందని అమెరికా తిట్టిపోసింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయమైన వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ జేన్ సాకీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ భారత్-రష్యా ఆయిల్ ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bullet Train: హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. వయా చిట్యాల-జగ్గయ్యపేట -మంచి లాభం: Uttam

‘అంతర్జాతీయ ఆంక్షలకు అన్ని దేశాలూ కట్టుబడి ఉండాలన్నదే మా సందేశం. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనాలనే భారత్ నిర్ణయం ఆంక్షల ఉల్లంఘన కాకపోవచ్చు. కానీ చరిత్ర పుస్తకాలు రాసేటప్పుడు భారత్ ఎటువైపు నిలబడిందని ఉంటుందో ఆలోచించండి. రష్యాకు ఆర్థికంగా ఊతమిచ్చే ఎలాంటి ఒప్పందమైనా ఉక్రెయిన్ పై యుద్దాన్ని సమర్థించినట్లే అవుతుంది. అది కచ్చితంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది’ అని జేన్ సాకి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Petrol Diesel: పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. అక్కడ 50శాతం పెంపు.. Ukraine Warతో ఇలా

అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా తన రిఫైనరీల్లో ఒప్పటికే తోడి ఉంచిన క్రూడ్ ఆయిల్ ను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. నిల్వలను తగ్గించుకొనే క్రమంలో మిత్ర దేశం భారత్ కు చవక ధరకే క్రూడ్ ఆయిల్ ఇస్తామని ఆఫరిచ్చింది. ఈ సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుచేస్తే(తక్కువ ధరే అయినా) యుద్ధాన్ని సమర్థించట్లవుతుందనే తర్జనభర్జనలు జరిగాయి. చివరికి రష్యన్ ఆయిల్ కొనాలనే భారత్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) సోమవారం నాడు 3.5మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ సరఫరాకు సంబంధించి రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందానికి విటోల్‌ సంస్థ మధ్యవర్తిగా ఉంది. షిప్పులో ఆయిల్ ను రష్యానే ఇండియాకు తరలించనుంది. మే నెలలో సరుకు చేరే అవకాశముంది. అయితే..

Telangana: బీజేపీ ఖాతాలో మరో విజయం.. CM KCR మెడలు వంచాం కాబట్టే శుభవార్త: బండి

రష్యా విషయంలో భారత్ పై జోబైడెన్ అధికారిక ప్రతినిధి ఈ స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. రష్యా తయారీ ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసినప్పుడు అమెరికా వద్దని చెప్పిందేగానీ శాపనార్థాలు మాత్రం పెట్టలేదు. నిజానికి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని భారత్ ఏనాడూ సమర్థించలేదు. యుద్దం నిలిపేసి ఇద్దరు అధ్యక్షులు నేరుగా మాట్లాడుకోవాలని తొలుత సూచించిన ప్రపంచ నేత మోదీనే. మరి రష్యాతో ఆయిల్ డీల్ పై అమెరికా పరోక్ష ఆగ్రహానికి భారత్ ఏమని బదులిస్తుందో చూడాలి..

First published:

Tags: India, Oil prices, Petrol Price, Russia, Russia-Ukraine War, USA

ఉత్తమ కథలు