హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Biden : రూటు మార్చిన అమెరికా..తప్పంతా ఉక్రెయిన్ అధ్యక్షుడిదేనన్న బైడెన్..మండిపడుతున్న ఉక్రెయిన్!

Biden : రూటు మార్చిన అమెరికా..తప్పంతా ఉక్రెయిన్ అధ్యక్షుడిదేనన్న బైడెన్..మండిపడుతున్న ఉక్రెయిన్!

జో బైడెన్-జెలెన్ స్కీ(ఫైల్ ఫొటో)

జో బైడెన్-జెలెన్ స్కీ(ఫైల్ ఫొటో)

Ukraine Slams Biden Comments on Zelensky : ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగింది రష్యా. కొద్దిరోజుల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను సొంతం చేసుకొని తద్వారా ఉక్రెయిన్ మెత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని రష్యా వేసిన ఎత్తులు ఫలించలేదు. ఉక్రెయిన్ సైన్యం,ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో రష్యా ఫ్లాన్స్ అన్నీ తుస్సు అయ్యాయి. అయినప్పటికీ నాలుగు నెలల నుంచి బాంబు దాడులు,మిసైల్ ఎటాక్ లతో ఉక్రెయిన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రష్యా.

ఇంకా చదవండి ...

Ukraine Slams Biden Comments on Zelensky : ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగింది రష్యా(Russia-Ukraine War).కొద్దిరోజుల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను సొంతం చేసుకొని తద్వారా ఉక్రెయిన్ మెత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని రష్యా వేసిన ఎత్తులు ఫలించలేదు. ఉక్రెయిన్ సైన్యం,ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో రష్యా ఫ్లాన్స్ అన్నీ తుస్సు అయ్యాయి. అయినప్పటికీ నాలుగు నెలల నుంచి బాంబు దాడులు,మిసైల్ ఎటాక్ లతో ఉక్రెయిన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రష్యా. రష్యా దాడి కారణంగా ఇప్పటికే వేలాది మంది ఉక్రెనియన్లు పొరుగుదేశాలకు వలస వెళ్లిపోగా..ఉక్రెయిన్ లోనే ఉండిపోయిన అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులు కూడా భారీగా ధ్వంసమవుతున్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.తప్పంతా ఉక్రెయిన్ అధ్యక్షుడిదే అన్నట్లు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్(Ukraine)మండిపడుతోంది.

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున విరాళాల సేకరణకు శనివారం లాస్‌ఏంజెలెస్‌లో జరిగిన కార్యక్రమంలో జో బైడెన్(Joe Biden)ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు మద్దతు కూడగట్టేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు గురించి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆరంభానికి ముందు నాలుగు నెలలనాటి పరిణామాలను ఈ సందర్భంగా బైడెన్ వివరించారు. , రష్యా దాడి గురించి తాము ముందస్తు హెచ్చరికలు చేసినా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Ukraine President Zelensky)పెడచెవినపెట్టారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మాట్లాడుతూ.."రష్యా దాడి గురించి నేను చేసిన ముందస్తు హెచ్చరికలను అతిశయోక్తిగా చేసిన ప్రకటన అని చాలామంది భావించారు.. అది నాకు తెలుసు. కానీ మాకున్న సమాచారం ఆధారంగా మేం వెల్లడించాం.. ఆయన (రష్యా అధ్యక్షుడు పుతిన్‌) సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మేం చెప్పిన విషయాన్ని వినడానికి ఇష్టపడలేదు. ఇంకా చాలామంది కూడా వినిపించుకోలేదు.. వారు మా మాటలను ఎందుకు వినకూడదనుకున్నారో నాకు అర్థమైంది.. కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు"అని తెలిపారు.

Hindus In Pakistan : పాకిస్తాన్ లో ఎంతమంది హిందువులు,క్రిస్టియన్లు ఉన్నారో తెలుసా

కాగా, ఫిబ్రవరి 24న ప్రత్యేక సైనిక చర్య పేరుతో రష్యా దురాక్రమణ మొదలుపెట్టడానికి ముందే.. రష్యా సైనిక సన్నద్ధతపై అమెరికా హెచ్చరికలు చేసింది. తేదీతో సహా యుద్ధం ప్రారంభమయ్యే రోజును కూడా ప్రకటించింది. కానీ, తేదీలో మార్పు జరిగినా..అంచనా వేసినట్టుగానే రష్యా సేనలు దురాక్రమణకు దిగాయి. అమెరికా హెచ్చరికలను ఐరోపా మిత్రదేశాలు కూడా కొట్టిపారేశాయి. అమెరికా మరీ ఎక్కువ ముందు జాగ్రత్త పడుతోందని అంతా భావించారు.

President Polls : రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్..ఈయన గెలిస్తే మామూలుగా ఉండదు మరి

ఇక,తాజాగా జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్ మండిపడుతోంది. బైడెన్ కామెంట్స్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతినిధి సెర్గీ నికిఫోరోవ్ మాట్లాడుతూ,... "ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధం ప్రారంభమయ్యే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మూడు లేదా నాలుగు సార్లు ఫోన్ లో మాట్లాడారు, ఈ సమయంలో వారు పరిస్థితిని అంచనా వేయడం గురించి వివరంగా చర్చించారు. కాబట్టి జెలెన్ స్కీ యుద్ధం గురించి తమ మాటలను వినడానికి ఇష్టపడలేదు అని బైడెన్ అనడం కరెక్ట్ కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా దళాలను ఉపసంహరించుకోవడానికి మరియు రష్యాపై ఆంక్షల ప్యాకేజీని ప్రవేశపెట్టాలని మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. మా భాగస్వాములు మా మాట వినడానికి ఇష్టపడలేదు అని చెప్పగలం"అని పరోక్షంగా అమెరికానే తమ మాటలను పెడచివినపెట్టిందని తెలిపారు.

First published:

Tags: Joe Biden, Russia, Russia-Ukraine War, Ukraine, USA, Vladimir Putin, Zelensky

ఉత్తమ కథలు