హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Israel-Ukraine: ఉక్రెయిన్‌కు ఐరన్ డోమ్ ను ఇజ్రాయిల్ అందిస్తుందా..? సహాయానికి ఎందుకు వెనకాడుతోంది..?

Israel-Ukraine: ఉక్రెయిన్‌కు ఐరన్ డోమ్ ను ఇజ్రాయిల్ అందిస్తుందా..? సహాయానికి ఎందుకు వెనకాడుతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రష్యా(Russia) దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను(Iron Dome Defense System) అందజేయాలని ఉక్రెయిన్ ఇజ్రాయెల్‌ను(Israel) కోరుతోంది. మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌(Missile Defense System) విక్రయాలను ఇజ్రాయెల్‌ ఆపేసిందని ఆరోపించడం మానేసిందని ఇజ్రాయెల్‌లోని ఉక్రెయిన్(Ukraine) రాయబారి యెవ్‌గెన్ కోర్నిచుక్ పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

రష్యా(Russia) దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను(Iron Dome Defense System) అందజేయాలని ఉక్రెయిన్ ఇజ్రాయెల్‌ను(Israel) కోరుతోంది. మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌(Missile Defense System) విక్రయాలను ఇజ్రాయెల్‌ ఆపేసిందని ఆరోపించడం మానేసిందని ఇజ్రాయెల్‌లోని ఉక్రెయిన్(Ukraine) రాయబారి యెవ్‌గెన్ కోర్నిచుక్ పేర్కొన్నారు. సైనిక సహాయంతో ఉక్రెయిన్‌కు మౌఖిక మద్దతును అందించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోర్నిచుక్ కోరాడు. కీవ్‌ ఐరన్ డోమ్(Iron Dome) సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటోందని, కొనుగోలుకు యూఎస్‌ ఎటువంటి అభ్యంతరం చెప్పదని కోర్నిచుక్‌ అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం(Israel Government) వాస్తవ స్థితికి తిరిగి రావాలని కోరుకుంటున్నామని, ఇజ్రాయెల్ సహాయం కావాలని ఇజ్రాయెల్‌లో ఉక్రెయిన్ రాయబారి యవ్‌గెన్ చెప్పారు.

ఇజ్రాయెల్‌ సైనిక- టెక్నాలజీ సపోర్ట్‌ అవసరం, భూభాగంలోని రష్యన్ మిసైల్స్‌ దాడుల నుంచి దేశ పౌరులను రక్షించుకునేందుకు ఐరన్ డోమ్ కావాలని కోర్నిచుక్‌ పేర్కొన్నారు. యూఎస్‌ అంగీకారం ఉన్నప్పటికీ జర్మనీ నుంచి ఉక్రెయిన్‌కు "స్పైక్" యాంటీ ట్యాంక్ మిసైల్స్‌ తరలింపులను ఇజ్రాయెల్ అడ్డకుందని కోర్నిచుక్ ఆరోపించాడు. ఇప్పటికే SPIKE 5వ తరం ATGMని 18 యూరోపియన్ యూనియన్, NATO సభ్యులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ మేజర్ రాఫెల్ విక్రయించాడు. 32 కి.మీ రేంజ్‌, 99.06 సెం.మీ ఆర్మర్‌ పెనెట్రేటింగ్‌ సామర్థ్యమున్న SPIKEను వాహనాలు, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ప్రయోగించే సదుపాయం ఉంది.

ఉక్రెయిన్‌కు ఐరన్ డోమ్ ఎలా సహాయం చేస్తుంది..?

ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ పరిశ్రమలు అభివృద్ధి చేసిన మొబైల్ ఆల్-వెదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 4 కి.మీ నుంచి 70 కి.మీ దూరం నుంచి ప్రయోగించే షార్ట్-రేంజ్ రాకెట్లు, ఫిరంగి షెల్స్‌ను అడ్డుకొని నాశనం చేసేలా తయారు చేశారు. 2011 నుంచి ఇజ్రాయెల్ సాయుధ దళాలతో సేవలో ఉన్న ఐరన్ డోమ్ వేలాది రాకెట్‌లను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఐరన్ డోమ్‌ను ఆయుధంగా కాకుండా రక్షణాత్మక నేపథ్యంలో ప్రాణాలను కాపాడే సాధనంగా ఇజ్రాయెల్ చూస్తోంది.

ALSO READ Man fight to get Rs 35 refund : రూ.35 కోసం రైల్వేతో పోరాడి..3 లక్షల మందికి లబ్ది చేకూర్చిన ఇంజినీర్

ఉక్రెయిన్‌కు ఐరన్ డోమ్ అందితే.. డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ ఫిరంగి కాల్పులు, మిసైల్స్‌ను అడ్డుకోగలదని విశ్లేషణలు వస్తున్నాయి. ఐరన్ డోమ్ సాయంతో పాశ్చాత్య దేశాల నుంచి అందిన ఆయుధాలను యుద్ధరంగంలో ఉక్రెయిన్‌ మోహరించగలదంటున్న నిపుణులు చెబుతున్నారు. ఐరన్ డోమ్ సిస్టమ్స్ రష్యా దురాక్రమణ నుండి వందలాది మంది అమాయకుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుందని ఉక్రెయిన్ పేర్కొంది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థంగా ఇజ్రాయెల్..

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించిన ఇజ్రాయెల్, మాస్కో యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించింది. రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య ఆంక్షలలో చేరడానికి నిరాకరించిన టెల్ అవీవ్, ఉక్రెయిన్‌కు మానవతా సహాయానికి మద్దతును పరిమితం చేసింది. సిరియాలో రష్యాతో సహకారాన్ని కొనసాగించాల్సిన అవసరం కారణంగా ఉక్రెయిన్‌కు సైనిక సహాయం చేయడానికి ఇజ్రాయెల్ సంకోచిస్తోంది. ఇజ్రాయెల్, రష్యా తమ మిలిటరీలను సిరియాలో చిక్కుకోకుండా ఉండేందుకు డికాన్‌ఫ్లిక్షన్ హాట్‌లైన్‌ ఏర్పాటు చేసింది.

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..

అంతర్యుద్ధం సమయంలో సిరియాలో వందల కొద్దీ వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన కొద్ది రోజులకే పుతిన్‌తో భేటీకి మాస్కో వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్. వివాదానికి ముగింపు పలికేందుకు పుతిన్, జెలెన్స్కీకి అనేక సార్లు ఫోన్‌ చేశారు. రష్యా FM ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చిన తర్వాత చెలరేగిన ఉద్రిక్తతలు.. ఇద్దరికీ "యూదుల రక్తం" ఉందని ఆరోపించారు. లావ్రోవ్ వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెల్‌, కీవ్‌ "నియో-నాజీ పాలన"కు టెల్ అవీవ్ మద్దతు ఇస్తోందని రష్యా ఆరోపించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌తో కాల్‌లో లావ్‌రోవ్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ “క్షమాపణలు” చెప్పినట్లు టెల్ అవీవ్ పేర్కొన్నారు.

First published:

Tags: Israel, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు