హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Gun Firing : రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పులు..మరో రెండు రోజుల్లో యుద్ధమేనా!

Gun Firing : రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పులు..మరో రెండు రోజుల్లో యుద్ధమేనా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Firing At Russia-Ukraine Border : సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు మొదలుపెట్టాయి. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్‌ సైన్యం పేర్కొనగా...ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు ఆరోపించారు.

ఇంకా చదవండి ...

Russia-Ukraine Conflict : రష్యా, ఉక్రెయిన్‌ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా.. సరిహద్దుల్లోభారీగా సైనికులను మోహరించింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిణామాలను యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత కలకలం రేపింది. రష్యా మద్దతు కలిగిన వేర్పాటు వాదులు-ఉక్రెయిన్‌ సైనికుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లు సమాచారం.

అయితే సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు మొదలుపెట్టాయి. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్‌ సైన్యం పేర్కొనగా...ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు ఆరోపించారు. 24 గంటల వ్యవధిలో నాలుగుసార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. సరిహద్దుల్లో సైన్యం మోహరించిన తరుణంలో రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌ ఆక్రమణకు ఓ కారణాన్ని చూపడంతోపాటు ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను రష్యా ఖండించింది. సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నామని, ఇప్పటికే దాదాపు లక్షకుపైగా సైనిక సిబ్బందిని వెనక్కి రప్పించే పనిలో ఉన్నామని తెలిపింది.


ALSO READ Ukraine-Russia : ఆ దేశంపై యుద్ధానికి..ఆర్మీలో చేరి శిక్షణ తీసుకుంటున్న 79 ఏళ్ల బామ్మ

అమెరికా మాత్రం రష్యా ప్రకటనను నమ్మడం లేదు. మరో రెండు రోజుల్లో రష్యా... ఉక్రెయిన్​ పై దాడి చేస్తుందనడానికి అమెరికాకు చాలా సంకేతాలు అందాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇతర దేశాలను తప్పుదోవ పట్టించేలా రష్యా చర్యలు చేపడుతున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్​ వివాదంపై స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్​.. అమెరికాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ తాను ఇంకా చదవలేదన్నారు బైడెన్​.మరోవైపు రష్యా.. తమ దేశంలోని అమెరికా సీనియర్​ దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చర్యకు గల కారణాన్ని రష్యా వెల్లడించలేదు. రష్యా వైఖరిని అమెరికా తప్పుపట్టింది.

First published:

Tags: Gun fire, Russia, Ukraine

ఉత్తమ కథలు