హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UKraine War: అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు..పేలితే యూరప్ మొత్తం నాశనం

UKraine War: అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు..పేలితే యూరప్ మొత్తం నాశనం

అణు విద్యుత్ కేంద్రంలో మంటలు

అణు విద్యుత్ కేంద్రంలో మంటలు

Zaporizhzhia nuclear power plant: రష్యా రెచ్చిపోతూనే ఉంది. ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు అణు పదార్థాలతో చెలగాటమాడుతోంది. యూరప్‌లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జాపోరిషియాపై రష్యా బాంబులు వేయడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్‌‌లో బాంబుల (Ukraine-Russia War) మోత మోగుతూనే ఉంది. తొమ్మిదో రోజు కూడా రష్యా దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. మొన్నటి వరకు సైనిక స్థావరాలపై విరుచుకుపడిన రష్యన్ సేనలు..ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా దాడులు చేస్తున్నాయి. తాజాగా అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా టార్గెట్ చేయడం సంచలనం రేపుతోంది. ఉక్రెయిన్‌లోని ఎనర్హోదర్ నగరంలో యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం ఉంది. దాని పేరు జాపోరిషియా (Zaporizhzhia nuclear power plant). ఉక్రెయిన్‌కు సరఫరా అయ్యే విద్యుత్తులో 20శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు ప్రపంచంలో ఉన్న 10 అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఆ అణు విద్యుత్ కేంద్రంపై శుక్రవారం తెల్లవారుఝామున రష్యా బలగాలు దాడులు చేశాయి. మిస్సైల్స్ ప్రయోగించాయి. బాంబు దాడులతో అణు విద్యుత్ కేంద్రంలో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్ర కుబేలా వెల్లడించారు. ఒకవేళ ఈ న్యూక్లియర్ ప్లాంట్‌లోని రియాక్టర్ పేలితే చెర్నోబిల్ పేలుడు కంటే పది రెట్లు ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. రష్యా తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

ఉక్రెయిన్‌పై నిషేధిత క్లస్టర్ బాంబ్స్ ప్రయోగిస్తున్న రష్యా.. వెల్లువెత్తుతున్న విమర్శలు..

అణు విద్యుత్ కేంద్రంలో మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని అణు విద్యుత్ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థిపై కాల్పులు.. కీవ్‌లో అల్లకల్లోలం

జాపోరిషియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్ చర్యలు యూరప్ భద్రతకే ముప్పుగా మారాయని అన్నారు.

అటు కెనడా ప్రధాని కూడా జస్టిన్ ట్రూడో కూడా రష్యాపై మండిపడ్డారు. జెలెన్‌స్కీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి చర్యలు ఆమోద యోగ్యం కావని..రష్యా వెంటనే తగ్గాలని డిమాండ్ చేశారు.

కాగా, ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ (Chernobyl disaster)లో ఉన్న నాలుగు అణు రియాక్టర్లలో 1986లో ఒక రియాక్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. దాని ప్రభావం యూరప్‌ వ్యాప్తంగా కనిపించింది. రేడియేషన్‌ ప్రభావంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా కాలం కొన్ని ప్రాంతాలు రేడియేషన్‌ ప్రభావానికి లోనయ్యాయి. చాలా మంది ప్రజలు క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఇప్పటికీ చెర్నోబిల్‌ ప్రాంతంలో రేడియేషన్‌ తీవ్రత ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ప్రమాదాల్లో చెర్నోబిల్‌ ఒకటిగా నిలిచిపోయింది.

First published:

Tags: International news, Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు