ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం (Ukraine Russia War) ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో 2019 నాటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏముంది ఈ ఫోటోలో అనుకుంటున్నారా.. ఈ ఫోటోలో ఉన్న ఓ జంట తమ శరీరంపై ఉక్రెయిన్, రష్యా జాతీయ జెండాలను కప్పుకున్నారు. 2019లో పోలాండ్‌లో జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ సమయంలో ఈ దృశ్యం కనిపించింది. ఈ ఫోటోలో ఉన్న మహిళ జులియానా కుజనెత్సోవా తన శరీరంపై రష్యా జెండా.. ఆమెతో ఉన్న యువకుడు ఉక్రెయిన్ జెండాను (Ukrainian flag) కప్పుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల పరిష్కారానికి ఈ ఫోటో చాలా బాగా సరిపోతుందంటూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
Ukraine Crisis: అవసరాలు, అహం, ఆత్మాభిమానం.. ఉక్రెయిన్ సంక్షోభానికి కారణాలు ఏంటీ?
Poignant: A man draped in the Ukrainian flag embraces a woman wearing the Russian flag. Let us hope love, peace & co-existence triumph over war & conflict. pic.twitter.com/WTwSOBgIFK
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2022
ఈ ఫోటోను కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కూడా ఈ ఫోటోను చూసి మురిసిపోయారు. ప్రేమ, శాంతి .. యుద్ధంపై విజయం సాధించాలని ఆశిస్తూ ట్వీట్ చేశారు. ఆయనే కాదు అంతర్జాతీయంగా చాలా మంది ఈ ఫోటోను షేర్ చేస్తూ శాంతి సాధ్యం అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.
Afghanistan: ఆఫ్ఘన్‌కు అమెరికా షాక్.. 700 కోట్ల డాలర్లు.. ఎవరికో తేల్చిన అగ్రరాజ్యం!
ప్రస్తుతం రష్యా (Russia)దాడులతో ఉక్రెయిన్( Ukraine) తమ దేశ పౌరుల(Civilians)తో పాటు పొరుగు దేశాల ప్రజల్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని మెట్రో స్టేషన్లు, షాపులు, బార్లు, సబ్వే స్టేషన్లును షెల్టర్ హోమ్స్‌గా మార్చింది. రష్యా వైమానిక దాడులను నివారించేందుకు ప్రాణనష్టం జరగకుండా ఉండేలా బాంబ్ షెల్టర్(Bomb shelters)లను ఆశ్రయిస్తోంది. ప్రస్తుతానికి ఒక సబ్వే స్టేషన్‌ను ఆశ్రయంగా నిర్మించింది.
Credit card Myths: క్రెడిట్ కార్డు తీసుకోవడం.. వినియోగంపై సందేహాలు ఉన్నాయా.. నిజాలు తెలుసుకోండి!
వందలాది మంది అందులోనే ఆశ్రయం పొందుతున్నారు. బాంబు దాడుల నుంచి రక్షించుకునేందుకు మెట్రో స్టేషన్ సిద్ధం చేసింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన పట్టణమైన కీవ్(Kiev)లో మెట్రోతో పాటు బాంబ్ షెల్టర్, మరో 4500 షెల్టర్ హోమ్స్ (Shelter homes) నిర్మించడం జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించిన నాటి నుంచి ఉక్రెయిన్‌లోని చాలా పెద్ద నగరాలు బాంబు శబ్ధాలతో దద్దరిల్లిపోతున్నాయి. రష్యా దాడుల నేపధ్యంలో ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమలులోకి రావడంతో పౌరుల్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో షెల్టర్ హోమ్‌లు ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War, Shashi tharoor, Twitter, Ukraine, Viral image