UKRAINE RUSSIA GENERALS BATTLE OF GENERALS AS PUTIN SENDS NEW COMMANDER TO UKRAINE GH VB
New General: రష్యా చేతి నుంచి చేజారుతున్న ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలు.. కొత్త జనరల్ పై భారం వేసిన పుతిన్..
పుతిన్ తో జనరల్ కమాండర్
ఏడు వారాలపాటు రష్యా దళాలను నిలువరించినట్లు ఖ్యాతి అందుకొన్న ఉక్రెయిన్ టాప్ మిలిటరీ కమాండర్‌కు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురుకానుంది. యుద్ధభూమిలో ఇద్దరు వ్యక్తుల నాయకత్వంపై ఆధారపడి ఉన్న రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో జరుగుతున్న విధ్వంసం ఇది.
ఏడు వారాలపాటు రష్యా(Russia) దళాలను నిలువరించినట్లు ఖ్యాతి అందుకొన్న ఉక్రెయిన్(Ukraine) టాప్ మిలిటరీ కమాండర్‌కు(Military Command) ఇప్పుడు కొత్త సవాల్ ఎదురుకానుంది. యుద్ధభూమిలో ఇద్దరు వ్యక్తుల నాయకత్వంపై ఆధారపడి ఉన్న రెండో ప్రపంచ యుద్ధం(Second World War) తర్వాత యూరప్‌లో(Europe) జరుగుతున్న విధ్వంసం ఇది. రష్యన్ జనరల్(Russian General) విషయానికి వస్తే.. ఇటీవల ఉక్రెయిన్‌లో రష్యా సైనిక నాయకత్వాన్ని జనరల్ అలెగ్జాండర్ డ్వోర్నికోవ్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పగించిన విషయం తెలిసిందే. బషర్ అల్-అస్సాద్‌కు రష్యా అధ్యక్షుడు మద్దతు ఇచ్చిన తర్వాత సిరియాలో ఉన్న మొదటి సీనియర్ కమాండర్ డ్వోర్నికోవ్. సిరియన్లపై విచక్షణారహితంగా జరిపిన బాంబు దాడులతో "సిరియా కసాయి"గా డ్వోర్నికోవ్కు పేరు ఉంది. అలెప్పోలో పౌరులపై రష్యా నిర్దాక్షిణ్యంగా బాంబు దాడి చేయడంతో అస్సాద్‌కు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
డ్వోర్నికోవ్ అడుగుపెట్టకముందే సిరియన్ అంతర్యుద్ధం చాలా "రక్తమయమైంది" అని విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో రష్యా అత్యున్నత గౌరవాన్ని అందుకున్న డ్వోర్నికోవ్.. సిరియాలో సేవలకు "రష్యన్ ఫెడరేషన్ హీరో"గా ఎంపిక చేసింది. సిరియాలో పనిచేసిన, ఉక్రెయిన్‌లో ఉన్న ఇతర రష్యన్ కమాండర్ల కంటే డ్వోర్నికోవ్ నాయకత్వం గొప్పదేమీ కాదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 1999 నుంచి 2009 వరకు చెచెన్లపై రష్యా దశాబ్దాల క్రూరమైన దాడిలో డ్వోర్నికోవ్ పనిచేశాడు.
ఉక్రెయిన్ జనరల్..
రష్యా దాడిని ఊహించి.. ఉక్రెయిన్ దళాల నాయకత్వ బాధ్యతలను జనరల్ వాలెరీ జలుజ్నీకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అప్పగించాడు. సోవియట్ అనంతరం పశ్చిమ దేశాలలో జలుజ్నీ శిక్షణ తీసుకున్నాడు.
2014లో మాస్కో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత NATO శిక్షణ వైపు జలుజ్నీ, ఇతర ఉక్రెయిన్ సైనిక అధికారులు మొగ్గు చూపారు. శిక్షణతో కెప్టెన్లు, లెఫ్టినెంట్లు, సార్జెంట్లను నిర్వహించే స్థాయికి జలుజ్నీ చేరాడు. అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు, ఉక్రెయిన్ యువతను ఉపయోగించుకోవాలని ఉక్రెయిన్ జనరల్ నమ్ముతున్నాడు. 1943 నాటి యుద్ధ ఉత్తర్వుల సహా మేము మ్యాప్‌ల నుంచి దూరంగా వెళ్లాలనుకుంటున్నాం.. లక్ష్యాన్ని సాధించడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తామాని జనరల్ వాలెరీ జలుజ్నీ పేర్కొన్నాడు.
ఇద్దరు జనరల్‌ల వ్యూహాల మధ్య తేడా ఏంటి..?
జనరల్ జలుజ్నీ ఫ్లెక్సిబుల్ ఫైటింగ్ స్టైల్.. విచక్షణారహితంగా దాడులు జరిపే జనరల్ డ్వోర్నికోవ్ తీరుకు భిన్నం. రష్యా సైన్యం అత్యంత కేంద్రీకృతమై ఉండగా.. ఉక్రెయిన్ దళాలకు పశ్చిమ దేశాలలో అనుభవం ఉంది. ఉక్రెయిన్‌కు NATO సరఫరా చేసిన ఆయుధాలను ఉపయోగించడంలో జలుజ్నీ శిక్షణ ఇవ్వగలడు.
పోర్టబుల్ షోల్డర్-ఫైర్డ్ జావెలిన్ మిసైల్స్, స్ట్రింగర్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలు, సాయుధ డ్రోన్లను జలుజ్నీ దళాలు ఉపయోగిస్తున్నాయి. రష్యన్ జనరల్ హ్యామరింగ్ స్టైల్‌ను ఉపయోగిస్తాడు, దూరం నుంచి బాంబు దాడులకు పాల్పడతాడు. పెద్ద మొత్తంలో విధ్వంసానికి, ప్రాణ నష్టానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కాన్వాయ్‌లపై హిట్-అండ్-రన్ దాడులను ఉక్రెయిన్ కమాండర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
డ్వోర్నికోవ్ తన సిరియన్ ప్లేబుక్‌ను అనుసరిస్తే.. ఉక్రెయిన్ పౌరులపై మరిన్ని దాడులు జరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
దురాగతాలను తిరస్కరించి ప్రత్యర్థులపైనే డ్వోర్నికోవ్ నిందలుమోపుతాడని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరు కమాండింగ్ జనరల్స్ ఇరు దేశాల రాజకీయాల అభిప్రాయాలను కూడా ప్రతిబింబిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకు జలుజ్నీ నాయకత్వం సరైన మార్గంలో ఉందని.. పుతిన్ ఊహించిన విధంగా ఇంకా యుద్ధం ముగియలేదని నిపుణులు అంటున్నారు. దెబ్బతిన్న తూర్పు ఓడరేవు మారియుపోల్, ఉత్తర సరిహద్దు నగరం ఖార్కివ్ కూడా రష్యా నియంత్రణలో లేవు. వారాల భీకర యుద్ధం తర్వాత రష్యా సైన్యాన్ని కీవ్ నుంచి దూరంగా ఉక్రెయిన్ దళాలు నెట్టగలిగాయి. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధంలో ఒక నెలలోపే ఐదుగురు అగ్రశ్రేణి సైనిక కమాండర్లను రష్యా కోల్పోయింది. కొత్త రష్యా కమాండర్ తన బలగాలను దక్షిణం, తూర్పు, ఉత్తరం అంతా విస్తరించడానికి బదులు వాటిని కేంద్రీకరించాలనుకుంటున్నారని సమాచారం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.