హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఉక్రెయిన్ సైనికుడి పట్ల అమానుషం.. రష్యా తీరును ఏకీపారేస్తున్న ప్రపంచ దేశాలు..

ఉక్రెయిన్ సైనికుడి పట్ల అమానుషం.. రష్యా తీరును ఏకీపారేస్తున్న ప్రపంచ దేశాలు..

ఉక్రెయిన్ సైనికుడి దారుణ పరిస్థితి.

ఉక్రెయిన్ సైనికుడి దారుణ పరిస్థితి.

Ukraine: రష్యా తన దగ్గర బందీలుగా ఉన్న ఉక్రెయిన్ సైనికులను విడుదల చేసింది. వీరిలో అందరిపరిస్థితి ఎంతో విషాదకరంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

రష్యా (Russia)  కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై (ukraine) ముప్పెట దాడి చేస్తుంది. ఇప్పటికే లకలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు అనాథలుగా మిగిలిపోయారు. ఉక్రెయిన్ నగరమంతా తన రూపురేఖలను కొల్పోయింది. ప్రపంచ దేశాలకు పుతిన్ తీరును తప్పుడుపడుతున్నాయి. ఇప్పటికే రష్యా అనేక మంది ఉక్రెయిన్ సైనికులను బంధించింది. ఇక.. ఉక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గకుండా రష్యను ఎదుర్కొంటుంది. ఇప్పటికే రష్య స్వాధీనం చేసుకున్న అనేక ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి తన ఆధీనంలో తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా రష్యా తాజాగా, 205 ఉక్రెయిన్ సైనికులను విడిచిపెట్టింది. వీరిలో చాలా మంది తమ రూపురేఖలను కొల్పోయారు. వీరిలో మైఖైలో డయానోవ్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. అతను పూర్తిగా బక్క చిక్కుకుని పోయి.. ఎముకల గూడుగా కన్పిస్తున్నాడు. ఉక్రెయిన్ సైన్యం అధికారిక ట్విటర్ ఖాతాలో రష్యా దేశం విడిచిపెట్టిన తమ సైనికుడి పోటోను పోస్ట్ చేశారు.

ఇప్పుడిది సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది. ప్రస్తుతం అతడిని కీవ్ లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని ఎముకల గూడుగా మారిపోయాడు. అతను కొలుకోవడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral)  మారింది.

ఇదిలా ఉండగా మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరిగి ఏడు నెలలు గడిచినా, ఇప్పటివరకు ఏ శిబిరం కూడా ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు.

ప్రపంచంలోని రెండవ అత్యంత శక్తివంతమైన రష్యన్ సైన్యం ఈ రోజుల్లో వ్యూహాత్మక యుద్ధాన్ని నొక్కి చెబుతోంది. ఆక్రమిత భూభాగాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ద్వారా రష్యాలో చేర్చాలని నిర్ణయించిన తర్వాత ఉక్రెయిన్ (Ukraine) కూడా తన భూభాగాలను విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో, రెండు వైపుల నుండి కొనసాగుతున్న పోరు మధ్య, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అణు దాడిని బెదిరించడం ద్వారా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేశారు. తన టెలివిజన్ ప్రసంగంలో, రష్యా(Russia) నాయకుడు ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాలపై దాడి చేస్తే, అణు దాడికి కూడా చెల్లించనని స్పష్టం చేశారు. తన నౌకాదళంలో భారీ అణు బాంబులను కలిగి ఉన్న రష్యా నిజంగా అణుయుద్ధాన్ని ప్రారంభించినట్లయితే, అది ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్నది ఓ పెద్ద ప్రశ్న ?

Published by:Paresh Inamdar
First published:

Tags: Russia-Ukraine War, VIRAL NEWS

ఉత్తమ కథలు