Home /News /international /

UKRAINE PRESIDENT VOLODYMYR ZELENSKY SACKS AMBASSADORS TO INDIA AND 4 OTHER NATIONS PVN

Zelensky : భారత్ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం..ఏకంగా రాయబారి తొలగింపు

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Ukraine President Sacks Ambassador To India: ఉక్రెయిన్ అధ్యక్షుడు(Ukraine President) జెలెన్ స్కీ(Zelensky)సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) కొనసాగుతున్న వేళ..భారత్ సహా నాలుగు దేశాల్లోని ఉక్రెయిన్ రాయబారులను(Ambassadors)తొలగిస్తూ జెలెన్ స్కీ నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
    Ukraine President Sacks Ambassador To India: ఉక్రెయిన్ అధ్యక్షుడు(Ukraine President) జెలెన్ స్కీ(Zelensky)సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) కొనసాగుతున్న వేళ..భారత్ సహా నాలుగు దేశాల్లోని ఉక్రెయిన్ రాయబారులను(Ambassadors)తొలగిస్తూ జెలెన్ స్కీ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం, జర్మనీ, నార్వే, చెక్ రిపబ్లిక్, హంగేరీ దేశాల్లోని ఉక్రెయిన్ రాయబారులను.. శనివారం తక్షణమే అమలులోకి వచ్చేలా తొలగించారు. ఈ మేరకు అధ్యక్షుడి వెబ్‌సైట్‌లో ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణాన్నీ అందులో వెల్లడించకపోవడం గమనార్హం. ఈ దేశాల్లో కొత్త రాయబారులను నియమిస్తారో లేదో కూడా సమాచారమివ్వలేదు. కాగా, యూరప్ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ రష్యాపై ఇంధన సరఫరాకోసం ఆధారపడి ఉండటంతో ఉక్రెయిన్‌కు, ఆ దేశానికి మధ్య బంధం అంతంతమాత్రంగానే ఉంది. మరి ఇతర దేశాల రాయబారులనూ ఉక్రెయిన్ ఎందుకు తొలగించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక,రష్యా దూకుడుకు తన దేశం ప్రతిస్పందించగలిగేలా ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతు, సైనిక సహాయాన్ని పొందేలా పనిచేయాలని జెలెన్స్కీ తమ దౌత్యవేత్తలను కోరారు. ఇదిలా ఉండగా శనివారం ఇండోనషియాలో జరిగిన జి20 సమావేశంలో ఉక్రెయిన్.. రష్యాతో తమ వివాదంలో కీలక మలుపు సమీపిస్తోందని పేర్కొంది. అదే సమయంలో, డాన్‌బాస్‌లో రష్యా సైనిక దాడిని ఆపడానికి మరిన్ని ఆయుధాలను అందించాలని మిత్రదేశాలను ఉక్రెయిన్ కోరింది.

    మరోవైపు, ఐదు నెలలుగా ఉక్రెయిన్​ తో జరుగుతున్న యుద్ధంపై రష్యా(Russia-Ukraine War) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఐదు నెలలుగా కొనసాగుతోంది. యుద్ధం కారణంగా వేల మంది ఉక్రేనియన్లు దేశం విడిచి,పొరుగు దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. రష్యా దాడి.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా(Europe)లో అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. అయితే పుతిన్ మాత్రం ఇప్పటివరకు చూసింది ట్రైలరేనని,తమ నిబంధనలను ఉక్రెయిన్ అంగీకరించకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాని తాజాగా హెచ్చరించారు. యుద్ధభూమిలో మాస్కో సేనలు ఇంకా తమ అసలైన చర్యను ప్రారంభించలేదని..ఇప్పటివరకు జరిగింది ఓ ట్రయిల్ మాత్రమేనని పుతిన్ తెలిపారు. 'ఉక్రెయిన్(Ukraine) ప్రజలకు ఇది విషాదం లాంటిదే కానీ, ప్రస్తుత పరిణామాలు ఈ దిశగానే వెళ్తున్నట్లు కనిపిస్తోందని గురువారం పార్లమెంట్ నేతలతో మీటింగ్ సందర్భంగా పుతిన్ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.



    Dubai Trip : దుబాయ్ ట్రిప్ కి వెళ్లాలనుకుంటున్నారా..ఇలా చేస్తే రెండు గంటల్లోనే వీసా

    "ఎక్కువగా చెప్పాలంటే మేము ఇంకా ఏదీ కూడా తీవ్రంగా ప్రారంభించలేదని అందరూ తెలుసుకోవాలి" అని పుతిన్ అన్నారు. పశ్చిమ దేశాలు శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నాయిని పుతిన్‌ ఆరోపించారు. యుద్ధం ముగింపు కోసం తాను చర్చలు జరిపేందుకు సిద్ధమేనన్నారు. అయితే ఆలస్యం అయ్యే కొద్దీ తమతో ఒప్పందం చేసుకోవడం వారికి మరింత కష్టమవుతుంది అని పుతిన్ హెచ్చరించారు.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: India, Ukraine, Zelensky

    తదుపరి వార్తలు