హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Ukraine: ఉక్రెయిన్ కీలకం నిర్ణయం.. నాటో సభ్వత్యం కోసం దరఖాస్తు.. రష్యా ఆ విధంగా చేసిన వెంటనే..

Ukraine: ఉక్రెయిన్ కీలకం నిర్ణయం.. నాటో సభ్వత్యం కోసం దరఖాస్తు.. రష్యా ఆ విధంగా చేసిన వెంటనే..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (ఫైల్)

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (ఫైల్)

Ukraine: NATO సైనిక కూటమిలో చేరేందుకు తమ దేశం త్వరితగతిన దరఖాస్తును సమర్పిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రష్యా అనేక భూభాగాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఉక్రెయిన్ అధికారికంగా NATO (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉక్రెయిన్ మీడియా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని పెద్ద భూభాగాన్ని రష్యాతో విలీనం చేసేందుకు పుతిన్ ఒప్పందాలపై సంతకం చేసిన తరుణంలో ఉక్రెయిన్ ఈ చర్య తీసుకుంది. అంతర్జాతీయ చట్టాలను దాటవేస్తూ ఉక్రెయిన్‌లోని నాలుగు భాగాలను రష్యాలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఒప్పందాలపై సంతకాలు చేశారు. పుతిన్ చర్య తీసుకున్న వెంటనే ఉక్రెయిన్ అధికారికంగా NATO సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది.

  NATO సైనిక కూటమిలో చేరేందుకు తమ దేశం త్వరితగతిన దరఖాస్తును సమర్పిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. అయినప్పటికీ వేగవంతమై అప్లికేషన్ అంటే ఏమిటో స్పష్టంగా తెలియలేదు. NATOలో చేరడానికి దాని సభ్య దేశాలన్నీ ఏకగ్రీవ మద్దతు అవసరం. వాస్తవానికి తాము ఇప్పటికే NATO కూటమి యొక్క ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నామని ఉక్రెయిన్ తెలిపింది.

  తాము ఒకరినొకరు విశ్వసిస్తున్నామని.. ఒకరికొకరు సహాయం చేస్తామని జెలెన్స్కీ తెలిపారు. తాము ఒకరినొకరు రక్షించుకుంటామని అన్నారు. ఏడు నెలల క్రితం రష్యా దాడి చేసినప్పటి నుండి ఉక్రెయిన్ సోవియట్ కాలం నాటి ఆయుధ వ్యవస్థలను విడిచిపెట్టింది. నాటో-ప్రామాణిక ఆయుధాలను ఉపయోగించింది.

  Lottery : ఒకే లాటరీకి 200 టికెట్ లు కొన్నాడు..16వేలు ఖర్చు పెట్టి రూ.8కోట్లు సంపాదించాడు

  China Police Posts : ప్రపంచవ్యాప్తంగా చైనా పోలీస్ స్టేషన్ లు..ఇప్పటికే 21 దేశాల్లో ఏర్పాటు

  అంతకుముందు క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాల్‌లో, పుతిన్ మరియు ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల అధిపతులు రష్యాలో తమ చేరికపై ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీంతో ఉక్రెయిన్‌లో ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత ఉధృతంగా మారుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకోవడంపై రష్యా రిఫరెండం నిర్వహించిన మూడు రోజుల తర్వాత ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు దీనిని ప్రత్యక్ష భూసేకరణ అని పేర్కొన్నాయి. ఇది తుపాకీతో చేసిన తప్పుడు కసరత్తు అని పేర్కొంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Russia, Russia-Ukraine War

  ఉత్తమ కథలు