Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

రష్యాని దెబ్బతీసేందుకు.. ఉక్రెయిన్ పెద్ద ప్లాన్..! సొంతంగా ఆయుధాల తయారీ.. యుద్ధంలో ఏ మేర ప్రభావం చూపుతాయంటే..?

రష్యాని దెబ్బతీసేందుకు.. ఉక్రెయిన్ పెద్ద ప్లాన్..! సొంతంగా ఆయుధాల తయారీ.. యుద్ధంలో ఏ మేర ప్రభావం చూపుతాయంటే..?

ఉక్రెయిన్ సొంతంగానే ఆయుధాలను తయారు చేసుకుంటుంది. (ARIS MESSINIS/AFP)

ఉక్రెయిన్ సొంతంగానే ఆయుధాలను తయారు చేసుకుంటుంది. (ARIS MESSINIS/AFP)

రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) నడుమ భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఇప్పటికే చాలా భాగం నష్టపోయినా వెనక్కి తగ్గే సమస్యే లేదంటూ పోరు కొనసాగిస్తున్నాయి. అయితే, ఉక్రెయిన్ ఆయుధాల కోసం పాశ్చాత్య దేశాల కోసం చూస్తూనే ఉండకుండా.. సొంతంగా ఆయుధాల (Weapon) తయారీ సిద్ధం చేసుకుంటోంది.

ఇంకా చదవండి ...

రష్యా-ఉక్రెయిన్ నడుమ భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఇప్పటికే చాలా భాగం నష్టపోయినా వెనక్కి తగ్గే సమస్యే లేదంటూ పోరు కొనసాగిస్తున్నాయి. అయితే, ఉక్రెయిన్ (Ukraine) ఆయుధాల కోసం పాశ్చాత్య దేశాల కోసం చూస్తూనే ఉండకుండా.. సొంతంగా ఆయుధాల తయారీ సిద్ధం చేసుకుంటోంది. వెపన్ సిస్టమ్స్ ఉపయోగించి రాకెట్‌ల (Rocket)ను ఉక్రెయిన్ అభివృద్ధి చేస్తోంది. అలా తయారు చేసిన 122MM MLRS, S-8 రాకెట్లను పౌరుల వాహనాలపై సైన్యం అమర్చుతోంది. రష్యాను ఎదుర్కోవడానికి కీవ్‌కు దేశీయంగా తయారు చేసిన రాకెట్‌లు సహాయపడతాయా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

వెస్ట్రన్ లాంగ్ రేంజ్ ఫిరంగుల కోసం ఉక్రెయిన్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో స్వదేశీ టెక్నాలజీపై కీవ్ గ్రౌండ్ ఫోర్సెస్ దృష్టి పెట్టాయి. ఉక్రేనియన్ సైనికులు 122MM MLRS, S-8 రాకెట్ లాంచర్‌లను ఉపయోగించి మెరుగైన ఫిరంగి వ్యవస్థలను తయారు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. స్థానికంగా తయారు చేసిన ఫిరంగి వ్యవస్థలను పౌర వాహనాలు, పికప్ ట్రక్కులపై అమర్చినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాహనంపై రాకెట్ లాంచర్‌ను మౌంట్ చేయడం వల్ల సిస్టమ్ మొబైల్‌గా మారి, కౌంటర్ అటాక్స్ ప్రమాదాలను తగ్గించగలదని భావిస్తున్నారు.

సిస్టమ్ 1

UNIMOG లైట్ ట్రక్‌పై 122MM రాకెట్స్ లాంచర్

4 లాంచర్ ట్యూబ్‌లను కలిపి యునిమోగ్ లైట్ ట్రక్కుపై ఉక్రేనియన్ సైన్యం అమర్చింది.. ఇప్పటివరకు వారు వారు అభివృద్ధి చేసిన ఫస్ట్ వెహికల్ ఇదే కావడం విశేషం. ఇది సోవియట్ తయారు చేసిన BM-21 MLRS వంటి 122mm గైడెడ్ రాకెట్లను కూడా కాల్చగలదు. అన్ గైడెడ్ రాకెట్‌లకు కంప్యూటరైజ్డ్ ఎయిమింగ్ సిస్టమ్ అవసరం లేదు కాబట్టి 122 ఎంఎం లాంచర్ ట్యూబ్‌ల ఇంటిగ్రేషన్ సులభం.. మొబైల్ ప్లాట్‌ఫారమ్ నుంచి భారీ ఫైర్‌పవర్‌ను అందించగల ఈ సిస్టమ్‌కు ఆదరణ కూడా పెరుగుతోంది.

122MM రాకెట్ల ఫీచర్లు

రేంజ్ - 20 కి.మీ

లెథల్ ఏరియా- 600 మీ x 600 మీ

రాకెట్లు నేలపై పేలితే గణనీయమైన ఫ్రాగ్మెంటేషన్ ఎఫెక్ట్‌ను ఇవి ఉత్పత్తి చేయగలవు. BM-21 రకం వ్యవస్థలను ప్రపంచవ్యాప్తంగా అనేక సైన్యాలు, మిలీషియాలు వినియోగిస్తున్నాయి. వీటిని వివిధ ప్రయోజనాల కోసం రక్షణ సిబ్బంది మోహరిస్తున్నారు.

122MM రాకెట్ల రకాలు

9M22U HE ఫ్రాగ్మెంటేషన్ రాకెట్

మెరుగైన పవర్ వార్‌హెడ్‌ ఉండే 9M521 HE ఫ్రాగ్మెంటేషన్ రాకెట్

సెన్సార్-ఫ్యూజ్డ్ సబ్-మ్యూనిషన్స్ ఉండే 9M217 రాకెట్

HEAT ఫ్రాగ్మెంటేషన్ సబ్-మ్యూనిషన్స్ ఉండే 9M218 రాకెట్

సిస్టమ్ 2

పికప్ ట్రక్‌పై ఉండే S-8 రాకెట్ లాంచర్ సిస్టమ్

మిత్సుబిషి పికప్ ట్రక్కుపై S-8 రాకెట్ లాంచర్‌ను సైన్యం అమర్చింది.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమోవ్ కా-52 హెలికాప్టర్ నుంచి S-8 రాకెట్ లాంచర్ వ్యవస్థను స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 122 mm రాకెట్ లాంచర్ సిస్టమ్ లాగా S-8 కూడా గైడెడ్ రాకెట్ల కుటుంబానికి చెందిందే కావడం విశేషం. S-8 ఒక రాకెట్ వెపన్. సైనిక విమానాల ఉపయోగం కోసం దీన్ని పూర్వపు సోవియట్ వైమానిక దళం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం రష్యన్ వైమానిక దళం వీటిని ఉపయోగిస్తుందని, ఎగుమతి చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. S-8 రాకెట్లు అన్ గైడెడ్ ఫ్రీ-ఫ్లైట్ రాకెట్లు. వీటిని ఏ సివీలియన్ ప్లాట్‌ఫారమ్‌ నుంచైనా ఇంటిగ్రేట్ చేయవచ్చని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. లాంచర్‌ను లక్ష్యం దిశలో చూపితే సెట్ అయ్యే టార్గెట్.. వార్‌హెడ్‌ ఆధారంగా రాకెట్ పరిధి 2 నుంచి 4.5 కిమీ వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఉక్రెయిన్‌కు చేరుకున్న హిమార్స్

తాము ఫస్ట్ HIMARS సిస్టమ్‌ను అందుకున్నట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెస్నికోవ్ ప్రకటించారు. మే 31న ఉక్రెయిన్‌కు $700 మిలియన్ల మిలిటరీ ప్యాకేజీలో భాగంగా హిమార్స్‌ను ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు US ప్రకటించింది. ఉక్రెయిన్ కోరిన ఈ ఆయుధాలు శత్రు దళాలను ఎక్కువ దూరం నుంచి మరింత కచ్చితంగా టార్గెట్ చేయగలవు.. ఉక్రేనియన్లు రష్యా భూభాగంపై దాడి చేయకుండా నిరోధించడానికి HIMARSలో కేవలం గైడెడ్ క్షిపణులనే యూఎస్ అమర్చింది. మరో 4 HIMARS మీడియం-రేంజ్ రాకెట్ లాంచర్లను ఉక్రెయిన్‌కు పంపడానికి కూడా యూఎస్ సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌కు కొన్ని ట్రాక్డ్ M270 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్‌ను పంపుతామని యూకే కూడా చెప్పింది. ఆగస్టు 2022 నాటికి నాలుగు MARS II MLRSలను పంపుతామని జర్మనీ చెప్పింది. తూర్పు ఉక్రెయిన్‌లో దాడులతో దూసుకుపోతున్న రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ వెపన్స్ అవసరం.. పాశ్చాత్య MLRSలు ఉక్రెయిన్‌కు చేరుకుంటున్నప్పటికీ, వాటిని యుద్ధభూమిలో ఎప్పుడు మోహరిస్తారనే విషయంపై స్పష్టత కొరవడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

First published:

Tags: International news, Russia, Russia-Ukraine War, Ukraine