హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Viral Video: చిన్న వాటర్ బాటిల్‌తో భారీ పేలుడును ఆపారు.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. వైరల్ వీడియో

Viral Video: చిన్న వాటర్ బాటిల్‌తో భారీ పేలుడును ఆపారు.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. వైరల్ వీడియో

వాటర్ బాటిల్‌తో బాంబు నిర్వీర్యం

వాటర్ బాటిల్‌తో బాంబు నిర్వీర్యం

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో రష్యా TOS-1A బాంబులను వేసింది. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖే వెల్లడించింది. ఇలాంటి శక్తివంతమైన బాంబులతో పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి.

రష్యా దాడులతో ఉక్రెయిన్ (Russia Ukraine War) ఉక్కిరిబిక్కిరయింది. ప్రకృతి సోయగాలు..చూడచక్కని కట్టడాలతో.. ఎంతో అందంగా ఉండే.. ఉక్రెయిన్..ఇప్పుడు అంధవిహీనంగా తయారయింది. కూలిపోయిన భవనాలు.. దెబ్బతిన్న రోడ్లు.. సైనికుల శవాలతో మరుభూమిగా మారిపోయింది. రష్యా విధ్వంసానికి ఉక్రెయిన్ ప్రజలు చెల్లాచెదురయ్యారు. ఇళ్లు..పొలాన్ని.. వదలిపెట్టి.. ప్రాణాలరచేత పట్టుకొని.. పారిపోయారు. రష్యా బాంబుల నుంచి తప్పించుకుంటూ దేశం దాటి వెళ్లిపోయారు. ఇలా రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వస్తున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ (Viral Video) అవుతోంది. జనావాసాల్లో పడిన భారీ బాంబును..ఒట్టి చేతులతో నిర్వీర్యం (Bomb defuse with bare hands) చేశారు. చిన్న బాటర్ బాటిల్‌తో భారీ పేలుడును అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

జెర్సీపై జడ్ అక్షరంతో వివాదం..తగ్గేగేలే అంటున్న రష్యా జిమ్నాస్ట్

ఉక్రెయిన్‌కు చెందిన ఓ ఎక్స్‌ప్లోజివ్ స్పెషలిస్ట్ రికార్డ్ చేశాడు. ఆ వీడియోను NEXTA అనే మీడియా సంస్థ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కొన్ని రోజులుగా రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో కీవ్‌ శివారులోని ఓ ప్రాంతంలో ఆకాశం నుంచి పెద్ద బాంబు పడింది. జనావాసాల మధ్యే బాంబు పడడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. కానీ అది పేలలేదు. కానీ ఏ క్షణమైనా విస్పోటనం చెందవచ్చు. అందుకే చుట్టుపక్కల స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణాలరచేత పట్టుకొని పక్క ఊరికి పారిపోయారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం అద్భుతం చేశారు. కేవలం చిన్న వాటర్ బాటిల్‌తో బాంబును నిర్వీర్యం చేశారు. బాంబు పిన్‌ను మెల్లగా బయటకు తీస్తూ.. పై నుంచి నీటిని పోశారు. బాంబును నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఆడకుండా నీరుపోశారు. ఈ ప్రక్రియను స్టీలీ సెనా అని పిలుస్తారట. ఆ బాంబు పేలితే ఎంతటి విధ్వంసం జరుగుతుందో వారికి తెలుసు.. ఐనా ధైర్యంగా ముందుకెళ్లి.. చాకచక్యంగా నిర్వీర్యం చేశారు.

2 ఏళ్లుగా ఫ్రూట్స్, వెజిటెబుల్స్ ముట్టని యువతి... ఆమె అందం చూస్తే మతిపోవాల్సిందే..

అది చిన్న బాంబు కాదు.. భారీ విధ్వంసం సృష్టించగలదని సిరియా కౌంటర్ టెర్రరిజం అండ్ ఎక్స్‌ట్రీమిజం ప్రోగ్రామ్ డైరెక్టర్ చార్లెస్ లిస్టర్ తెలిపారు. చాలా శక్తివంతమైనదని.. ఇది పెద్ద భవనాన్ని నేలమట్టం చేస్తుందని వెల్లడించారు. ఒకవేళ అది పేలి ఉంటే..ఆ ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకుపోయేదని.. అలాంటి బాంబును ఒట్టి చేతులతో నిర్వీర్యం చేయడం నిజంగా గ్రేట్ అని కొనియాడారు. మార్చి 10న పోస్ట్ చేసిన వీడియోను ఇప్పటికే 32 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో రష్యా TOS-1A బాంబులను వేసింది. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖే వెల్లడించింది. ఇలాంటి శక్తివంతమైన బాంబులతో పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి. ప్రజల అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతింటాయి. భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఈ వారం రష్యా ఉక్రెయిన్‌పై 500 కిలోల బాంబును విసిరి.. దానితో 21 మందిని చంపింది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఉక్రెయిన్ వ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయి.

First published:

Tags: International news, Russia, Russia-Ukraine War, Ukraine, Viral Video

ఉత్తమ కథలు